Breaking News

Daily Archives: January 29, 2018

ముగిసిన జంతు గణన

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నాలుగేళ్ళకోసారి నిర్వహించే జంతుగణన ఈనెల 22 నుంచి 29 వరకు జిల్లావ్యాప్తంగా కొనసాగిందని అటవీశాఖ డివిజనల్‌ అధికారి రేఖాభాను తెలిపారు. అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 65 బీట్‌ల పరిధిలో జంతు గణన చేసినట్టు తెలిపారు. చిరుతలు, ఎటుగుబంట్లు, నక్కలు, తోడేళ్లతోపాటు ఇతర జంతువులను మాంసాహార జంతువులుగా గుర్తించినట్టు తెలిపారు. హైనా, మనబోతు, కొండగొర్రె, కుందేలు, జింక, నెమళ్ళను శాఖాహార జంతువులుగా ...

Read More »

జేసి ఇంట్లో చోరీకి యత్నం

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అద్దెకు ఉంటున్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఎటువంటి వస్తువులు లభించకపోవడంతో అక్కడినుంచి పారిపోయారు. సోమవారం ఇంటికి వచ్చిన జేసి పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సకాలంలో అందేలా ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. సోమవారం జనహితలో ఏర్పాటైన కన్వర్జెన్సీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్న వ్యాపారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలపై ఎస్‌సి, ఎస్‌టి, యువజన, లీడ్‌బ్యాంక్‌ శాఖలు సంయుక్తంగా అవగాహన కల్పించాలన్నారు. ఫిబ్రవరి 15 నాటికి జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించేందుకు ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దత్తత గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, ...

Read More »

చిట్యాల గ్రామంలో అగ్నిప్రమాదం

  – 10 లక్షల ఆస్తినష్టం కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరగగా పదిలక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని వడ్లూరు బాలయ్యకు చెందిన 20 వేలతోపాటు తులం బంగారం, ఇల్లు, వంటసామగ్రి కాలిబూడిదయ్యాయి. సిద్దవ్వకు చెందిన నగదు 50 వేలతో పాటు ఆహారధాన్యాలు, ఇల్లు దగ్దమయ్యారు. వడ్లూరి కిషన్‌కు చెందిన బైక్‌తోపాటు వడ్లు, మక్కలు, శనగలు కాలిపోయాయి. మంటల్లో ఓ సిలిండర్‌ సైతం పేలడంతో ఆస్తినష్టం జరిగింది. ...

Read More »

ప్రజావాణిలో 45 ఫిర్యాదులు

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 45 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. రెవెన్యూశాఖకు సంబంధించి 17, డిహెచ్‌వో 4, పంచాయతీరాజ్‌ -4, మునిసిపల్‌ 7, పోలిసుశాఖ 3, ఆర్టీసి 2 శాఖలకు సంబందించి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు.

Read More »

సంధ్య మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన గర్భిణీ సంధ్య మృతికి కారకులైన వైద్యులపై చట్టరీత్యా చర్యలుతీసుకోవాలని ఏఐఎఫ్‌డిడబ్ల్యు కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేద మహిళలు అవస్థలు పడుతున్నారన్నారు. వారం కిందటే ఈ విషయంలో ఆందోళన చేశామని, అయినా వైద్యుల తీరులో మార్పు రాకపోవడం సంద్య మృతికి ...

Read More »

ముదిరాజ్‌ సంఘ భవనానికి 5 లక్షల నిధులు

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పెద్దమ్మవాడ ముదిరాజ్‌ సంఘం కమిటీ హాల్‌ భవనానికి ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ రూ. 5 లక్షల నిదులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ నాయకులు హైదరాబాద్‌లోని షబ్బీర్‌ అలీ నివాసంలో ఆయన్ను కలిసి సన్మానించారు. నిధులు విడుదలచేసినందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మామిండ్ల అంజయ్య, నర్సయ్య, చింతల యాదగిరి, చింతల శ్రీనివాస్‌, చింతల నీలకంఠం, రమేశ్‌, నర్సింలు, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More »

క్రీడాకారులు భవిష్యత్‌ తరాలకు క్రీడలను అందించాలి

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్‌ తరాలకు క్రీడలను అందించాల్సిన బాధ్యత ఇప్పటి క్రీడాకారులపై ఉందని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సోషల్‌ డెవలప్‌మెంట్‌ డాక్టర్‌ జ్యోతి బుద్ద ప్రసాద్‌ ఐఏఎస్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ రెసిడెన్షియల్‌ రెండవ రాష్ట్రస్తాయి 2017-18 డిగ్రీ విద్యార్థుల స్పోర్ట్స్‌ మీట్‌ను సోమవారం దోమకొండ మండలం తెలంగాణ రెసిడెన్షియల్‌ మహిళా ఇంగ్లీష్‌ మీడియం ప్రాంగణంలో రాష్ట్ర గురుకుల సెక్రెటరీ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ...

Read More »