Breaking News

Daily Archives: January 30, 2018

 నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం 

.. ఆలయాలు మూసివేత …  తెలుగు సంవత్సరాదిలో చివరిసారిగా  సంపూర్ణ చంద్ర గ్రహణం బుధవారం సాయంత్రం ఏర్పడుతుంది.  చంద్ర గ్రహణం కారణంగా కామారెడ్డి నిజామాబాదు జిల్లా ల్లో  ఆలయాలను ఉదయం 11గంటల నుండి గురువారం ఉదయం 5గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతి నిధులు తెలిపారు. ఆశ్లేష నక్షత్ర మాఘ పూర్ణిమ  కర్కాటక రాశిలో రాహూ గ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ వేదపండితుడు కిషన్ రావు జోషి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల లోపు భోజనాలు ముగించుకోవావని , గ్రహణం సాయంత్రం ...

Read More »

వైభవంగా గీతా యజ్ఞం

ప్రకృతి వన మూలికలతో చేసే యజ్ఞం సకల దోషాలను నివారించి పర్యావరణం కు దోహదపడుతుందని అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి అధ్యక్షుడు నరేందర్ రావు షిండే అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక గీతా భవనంలో మాఘ పౌర్ణమి గీతా యజ్ఞం ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ అనాది కాలం నుండి బుషులు లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాదులు చేసే వారని ; కాల క్రమేణా ఈ హైటెక్ యుగంలో యజ్ఞ యాగాలు లేక పర్యావరణ పరిరక్షణ దెబ్బ ...

Read More »

కాంగ్రెస్ కి మరో ఝలక్

ఈరోజు తెలంగాణా రాష్ట్ర సమితి(TRS) పార్టీ లో ఉస్మాన్ అలీ(తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ & మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్) మరియు హాబీబుద్దిన్ (జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ &కో ఆప్షన్) చేరారు,వీరిని నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు మరియు ఆర్మూర్ శాసన సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు వీరిని పార్టీ కండువా కప్పి సహణంగా పార్టీ లోకి ఆహ్వానించరూ వీరి వెంట TRS సీనియర్ నాయకులు సంజయ్ సింగ్ బబ్లూ,మరియు సాజిద్ అలీ గారు పాల్గొన్నారు ...

Read More »

టిజివిపి ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ

  Kamareddy, January 30 Nizamabad News Dot In: TGVP Kamara Reddy district department organized the commemoration of Indian soldiers and martyrs in Orkids School in Kamareddy town Tuesday. On this occasion, silence with the students was silenced for self-sacrifice. Speaking to TGVP Secretary of State Naveen, Naveen said that many soldiers were protecting the nation from protecting the country and ...

Read More »

లేబర్‌ కార్యాలయంలో సిబ్బందికోసం మంత్రికి వినతి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లేబర్‌ కార్యాలయంలో సిబ్బందిని నియమించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం కార్మికులు వినతి పత్రం సమర్పించారు. ఏఐసిటియు అనుబంధ ఐక్య బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత కార్మికుల సమస్యలు మరింత ఎక్కువయ్యాయన్నారు. కార్మికశాఖలో సిబ్బంది లేకపోవడం ...

Read More »

రైతు రుణాలు లక్ష్యం ప్రకారం అందించాలి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రబీ సీజన్‌లో రైతులకు సకాలంలో రుణాలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. కామారెడ్డిలో మంగళవారం డిఎల్‌ఆర్‌సి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయకుండా అతి తక్కువ వడ్డికి రైతులకు రుణాలు అందించేలా బ్యాంకులు కృసి చేయాలని సూచించారు. 2017-18 సంవత్సరానికి గాను 76 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయన్నారు. ...

Read More »

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ కళాశాలలో డిఇడి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా కళాశాల సెక్రెటరీ అమీర్‌ మాట్లాడుతూ దేశం అభివృద్ది, దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, ఉపాధ్యాయునితోనే సాద్యమని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. డైరెక్టర్‌ హైమద్‌, ఎస్‌బిహెచ్‌ సీనియర్‌ మేనేజర్‌ కబీర్‌, ప్రిన్సిపాల్‌ ...

Read More »

గురువులేనిదే సమాజానికి మనుగడ లేదు

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువు లేనిదే సమాజానికి మనుగడ లేదని, సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది గురువేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ప్రమాణాలు, ఫలితాలపై ప్రధానోపాధ్యాయుల నుద్దేశించి మంత్రి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ...

Read More »

పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలి

  – పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో డిఐజి శివశంకర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసులు నిజాయితీగా వ్యవహరించి మంచి పేరు సంపాదించాలని నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజి శివశంకర్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తిచేసుకొని క్యాడెట్‌ ట్రేనీ కానిస్టేబుళ్ళ (ఆర్మ్‌డ్‌ రిజర్వుడు) పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పోలీసు ఉద్యోగులుగా నియమించబడిన అందరికి అభినందనలు తెలిపారు. ఎటువంటి అవగాహన లేకుండా పోలీసు ...

Read More »

గొర్రెల పంపిణీలో రాష్ట్రంలో కామారెడ్డి ప్రథమస్థానం

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోనే గొర్రెల పంపిణీ పథకంలో కామారెడ్డి జిల్లా వందశాతం లక్ష్యాన్ని సాదించి మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను మంత్రి అభినందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో జిల్లా పశువైద్య, పశు సంవర్దకశాఖ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకం, అభివృద్ది కార్యక్రమం, గొర్రెల పంపిణీ మొదటి విడత లక్ష్యం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభకు ఆయన ముఖ్య ...

Read More »

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో తెరాసలో చేరిన పలువురు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో పలువురు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, వివిధ గ్రామాభివృద్ది కమిటీల సభ్యులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలామంది తెరాసలో చేరుతున్నారని, రానున్న రోజుల్లో ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ పార్టీ పటిష్టానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెరాసలో ...

Read More »

జర్నలిస్టు నరేంద్ర అందరికి ఆదర్శం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధి నిర్వహణలో నక్సల్స్‌ చేతిలో మరణించిన జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర అందరికి ఆదర్శ ప్రాయుడని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలో స్వర్గీయ మల్లెపూల నరేంద్ర 27వ స్మారక క్రీడలను మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ మైదానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నరేంద్ర స్మారకార్థం క్రీడలు నిర్వహించడం గొప్పవిషయమని, జర్నలిస్టు నరేంద్రను ఆదర్శంగా తీసుకొని జర్నలిజం విలువలను కాపాడాలని ...

Read More »

టిఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల టిఎన్జీవోస్‌ భవనంలో గాంధీవర్ధంతిని పురస్కరించుకొని అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కిషన్‌ ఆద్వర్యంలో అమరులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా కిషన్‌ మాట్లాడుతూ బాపూజీ దేశం కోసం శాంతియుతంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగ ఫలితంగానే దేశం ఈరోజు స్వాతంత్య్ర ఫలాలు పొందుతుందని పేర్కొన్నారు. గాందీజి ఎంచుకున్న శాంతిమార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి ...

Read More »

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బిగాల

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త మంగళవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. 40వ డివిజన్‌, 42వ, 44వ, 45వ, 46వ, 48వ, 39వ డివిజన్‌లలో లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. తనవంతు సాయంగా నూతన వధూవరులకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. అదేవిధంగా 43వ డివిజన్‌లోని అంబేడ్కర్‌ కాలనీలో ఎస్‌సి సంఘానికి 10 లక్షల నిధులు మంజూరుచేసి భూమిపూజ చేశారు. 39వ ...

Read More »

అమరుల త్యాగ ఫలమే దేశానికి స్వాతంత్య్రం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతోమంది అమరుల త్యాగఫలమే మనదేశానికి స్వాతంత్య్రం లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరులైన స్వాతంత్య్ర సమరయోధుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలు పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కీలకపాత్ర పోసించారని, మహాత్మాగాందీ శాంతిమార్గం ద్వారా దేశానికి స్వాతంత్య్రం లభించిందని, బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని అమరవీరుల సంస్మరణ ...

Read More »

ప్రజల్ని అనారోగ్యం పాలుచేస్తున్న ప్రభుత్వం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నత్తనడకన సాగుతున్న పనులపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో శివాజీనగర్‌ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అర్వింద్‌ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతుల వల్ల, పనుల్లో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పనుల వల్ల ఏర్పడే దుమ్ము, ధూళి వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన ...

Read More »