Breaking News

 నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం 

.. ఆలయాలు మూసివేత …
 తెలుగు సంవత్సరాదిలో చివరిసారిగా  సంపూర్ణ చంద్ర గ్రహణం బుధవారం సాయంత్రం ఏర్పడుతుంది.  చంద్ర గ్రహణం కారణంగా కామారెడ్డి నిజామాబాదు జిల్లా ల్లో  ఆలయాలను ఉదయం 11గంటల నుండి గురువారం ఉదయం 5గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతి నిధులు తెలిపారు. ఆశ్లేష నక్షత్ర మాఘ పూర్ణిమ  కర్కాటక రాశిలో రాహూ గ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ వేదపండితుడు కిషన్ రావు జోషి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల లోపు భోజనాలు ముగించుకోవావని , గ్రహణం సాయంత్రం 5 గంటలకు ఆరంభ మై రాత్రి  8:45 నిమిషాలకు విడుస్తుందన్నారు. గర్భిణులు, తుల ,కుంభ ,మిథన ,కర్కాటక  రాశి ఆశ్లేష నక్షత్ర జాతకులకు గ్రహణ దోషం ఉంటుందని పరిహార పూజలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని చెప్పారు. గ్రహణం తర్వాత  పవిత్ర స్నానం చేసి భోజనం చేయవచ్చునని గ్రహణ దోష పరిహారం కోసం శివాలయ దర్శనం, శివాభిషేకాలు చేయాలని సూచించారు 
.. సూపర్ మూన్ ..
150 సంవత్సరాల తర్వాత ఒకే నెలలో రెండు పున్నములు భూమి చంద్రుడు అతి దగ్గరగా రావడం ; చంద్రుడు బుధవారం సాయంత్రం రాగి రంగులో కనిపిస్తాడని అందుకే బ్లడ్ మూన్ లేదా కపర్ మూన్ పిలుస్తారని ఖగోళ శాస్త్రవేత్త  ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ జనగామ రాజమౌళి శర్మ సిద్ధాంతి చెప్పారు. మామూలు రోజుల్లో కనిపించే చంద్ర మామతో పోలిస్తే 14 శాతం పెద్దగా 30 శాతం కాంతిమంతంగా చందమామ కనిపిస్తుందని  ఏ పరికరం లేకుండా ఆసక్తి ఉన్నవారు చూడవచ్చునని  తెలిపారు. 150 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖగోళ సంబరం అన్నారు. 

Check Also

భక్తుల సౌకర్యార్థం బోరుమోటారు ప్రారంభం

  బీర్కూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ గ్రామ శివారులోని సర్వాపూర్‌ హనుమాన్‌ ఆలయం ...

Comment on the article