Breaking News

Daily Archives: February 1, 2018

ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షునికి సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని గురువారం తెలంగాణ జూనియర్‌ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బాలు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌లు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నామని, కానీ కేవలం 8 నెలల వేతనం మాత్రమే పొందుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను ప్రతియేడు యధావిధిగా కొనసాగించాలని, 11 నెలల వేతనం ...

Read More »

ఆర్యవైశ్య సంఘ సమావేశంలో పలు తీర్మానాలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గురువారం కామారెడ్డి పట్టణంతోపాటు జిల్లాలోని 12 మండలాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షునిగా నాగేశ్వర్‌రావును నియమించడానికి పట్టణ నాయకులతో పాటు 13మండలాల ఆర్యవైశ్యులు మద్దతు ప్రకటించారు. బాన్సువాడకు చెందిన వైశ్యనేత నార్ల సురేశ్‌ రెండ్రోజుల క్రితం ఆర్యవైశ్య ఎన్నికల్లో అసత్య ప్రచారం చేయడాన్ని సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన క్షమాపణ ...

Read More »

జర్నలిస్టు పాస్‌లను అందజేసిన మేనేజర్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు రైల్వేలో 50 శాతం కన్సేషన్‌ పాస్‌లను గురువారం రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ అందజేశారు. గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో వాటిని ఆయన పంపినీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా నూతన జిల్లా అయిన కామారెడ్డికి ప్రత్యేకంగా పాస్‌లు అందజేశామన్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో మొదటి సారిగా పాస్‌ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినట్టు ...

Read More »

సైన్స్‌ ప్రాక్టీకల్స్‌ పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైన్స్‌ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టీకల్స్‌ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నోడల్‌ ఇన్‌చార్జి అధికారి జి.కాశయ్యకు గురువారం టిజివిపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. కనీస అవసరాలు, ల్యాబులు, మౌలిక వసతులులేని ప్రయివేటు కళాశలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నిఖిల్‌పటేల్‌, ప్రతినిధులు నవీన్‌కుమార్‌, అమర్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కొవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ కెదురవుతున్న పరిస్థితులను ఎదుర్కొవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం కామారెడ్డి జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుటుంబ వ్యవస్థలో ఆహ్లాదకర వాతావరణంలో బంధుత్వాలను కొనసాగించాలన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచనలు చేయాలని, మంచి ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అసంతృప్తిని, వ్యతిరేక ఆలోచనలు దరిచేరనీయొద్దని సూచించారు. తల్లిదండ్రులు మనమీద పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా, గొప్ప లక్ష్యాలు ఏర్పరుచుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ...

Read More »

నిరుద్యోగ, రైతు సమస్యలపై సంఘటిత ఉద్యమం

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ, రైతు సమస్యలపై సంఘటితంగా ఉద్యమం చేపడతామని టిజేఏసి ఛైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌ అన్నారు. కామారెడ్డిలో గురువారం నిర్వహించిన రైతుల, నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నప్పటికి ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో విఫలమవుతుందన్నారు. ఎరువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎరువుల ధరలు పెరిగిపోతు రైతు పంటలకు దిగుబడిలేక, గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారన్నారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ...

Read More »

పారిశుద్య కార్మికుల సమస్యలు పరిస్కరించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది సమస్యలు పరిస్కరించాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అద్యక్షుడు ఓమయ్య డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌కు కార్మికులతో వచ్చి ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా మౌలిక వసతులు, ఇతర వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంపై పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌, వైద్యకళాశాల ...

Read More »

జర్మనీలో తెరాస శాఖను ప్రారంభించిన మహేశ్‌ బిగాల

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్మనీ దేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖను ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ బిగాల మహేశ్‌ కుమార్‌ గుప్త ప్రారంభించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై జర్మనీలో ఉంటున్న తెలంగాణవారు తెరాస శాఖను ప్రారంభించాలని కోరారు. వీరి కోరికమేరకు జర్మనీ వెళ్ళి మహేశ్‌ బిగాల అక్కడ తెరాస తాత్కాలిక కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్‌ బిగాల జర్మనీ నుంచి మాట్లాడుతూ తెరాస శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ...

Read More »

కాల్‌సెంటర్‌ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌ ప్రాంతంలో ఎస్‌కెఎస్‌ అనే కాల్‌సెంటర్‌ సంస్థను స్థాపించి నిరుద్యోగుల వద్దనుంచి ఒక్కొక్కరినుంచి రూ. 20 నుంచి 30 వేల వరకు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులను 4వ టౌన్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో కాల్‌సెంటర్‌ సంస్థను ప్రారంభించి నిరుద్యోగ యువత నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్‌ పోలీసులు సంస్థ నిర్వాహకులను ...

Read More »

వనబోతులను కాపాడిన ఫారెస్టు సిబ్బంది

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం కెనాల్‌లో ప్రమాదవశాత్తు మూడు అడవి జంతువులు అందులో రెండు వనబోతులు ఒక జింక పడిపోయాయి. కెనాల్‌లో జంతువులు పడిపోవడాన్ని గమనించిన గ్రామస్తులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది సింగీతం కెనాల్‌ వద్దకు చేరుకున్నారు. ఫారెస్టు డివిజన్‌ ఆఫీసర్‌ గోపాల్‌రావు, సెక్షన్‌ ఆఫీసర్‌, గ్రామస్తుల సహకారంతో జంతువులను కెనాల్‌ నుంచి బయటకు తీసి చికిత్స అందించి, తిరిగి అడవిలో వదిలిపెట్టారు.

Read More »

సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని హమాల్‌వాడిలోని సంతోషిమాత, సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని సంప్రోక్షణ, శుద్ది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ఛైర్మన్‌ నర్సింహ ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవో మహేందర్‌గౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు పటేవార్‌ శ్రీనివాస్‌, దయానంద్‌ గుప్త, చింత శ్రీనివాస్‌ గుప్త, హరిబాబు గుప్త, గంగాధర్‌, అర్చకులు విలాస్‌రావు, సుభాష్‌ శర్మ, శివాజీ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

Read More »

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త గురువారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44వ డివిజన్‌లోని ఆదర్శనగర్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో నిర్మించే డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. దీనికి గాను ఎమ్మెల్యే రూ. 20 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, కార్పొరేటర్‌ సాయిలు, తదితరులున్నారు.

Read More »

అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం చిట్యాల్‌ గ్రామ పంచాయతీలో మూడురోజులక్రితం మూడు నివాసపు గుడిసెలు దగ్దమయ్యాయి. కాగా భారీగా ఆస్తి నస్టం జరిగిందని తెలిసింది. తినడానికి కూడా తిండి లేకుండా, కట్టు బట్టలతో సహా అన్నిపూర్తిగా కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న సుభాష్‌రెడ్డి స్వచ్చంద సంస్థ వారు గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. వడ్లూరి బాలయ్య శోభ కుటుంబానికి రూ. 5 వేలు, వడ్లూరి ...

Read More »

రెండు పడక గదుల ఇళ్ళ కోసం ధర్నా

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమకు రెండు పడక గదుల ఇళ్ళను కేటాయించాలని డిమాండ్‌ చేస్తు మాక్లూర్‌ మండలం గుప్త గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చిన హామీలన్ని విస్మరిస్తోందని, వీటిపై ప్రశ్నించేవారిని జైల్లో పెడుతుందని ఆరోపించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల సాగుభూమి ఇంతవరకు ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్‌, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

13 గంటల నాట్య ప్రదర్శన

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భరతముని జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యూఅంబేడ్కర్‌ భవన్‌లో సంస్కారభారతి ఆధ్వర్యంలో గురువారం బొమ్మిడి నరేశ్‌కుమార్‌చే 13 గంటల నిరంతర నాట్య ప్రదర్శన కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచి నిర్విరామంగా 13 గంటల పాటు నాట్య ప్రదర్శన జరిగిందని సంస్కారభారతి ఇందూరు ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రసాద్‌ తెలిపారు. కళారంగంలో ఒక రికార్డు అని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం భరతముని జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర ...

Read More »

వార్డు ఎన్నిక ఏకగ్రీవం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని 8వ వార్డు ఎన్నిక ఏకగ్రీవమైనట్టు మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ తెలిపారు. వార్డు ఎన్నికకు నోటిఫికేషన్‌ వేశామని, నసురుల్లాబాద్‌ గ్రామానికి చెందిన పాషా బేగం మాత్రమే నామినేషన్‌ వేశారని, ప్రత్యర్థులు ఎవరు లేకపోవడంతో పాషా బేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు, ఈ మేరకు ఎన్నిక పత్రం గురువారం జారీచేశామని వివరించారు. గ్రామ సర్పంచ్‌ అరిగె సాయిలు, ఎంపిటిసి కంది మల్లేశం, తెరాస పార్టీ గ్రామాధ్యక్షుడు లచ్చన్నగౌడ్‌, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

ఆలూరులో పన్నుల వసూలు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు గురించి గురువారం ప్రత్యేక బృందం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బృందంలో ఎంపిడివో లింగయ్య మౌర్య, ఈఓపిఆర్‌డి దామోదర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సూరత్‌రెడ్డి, కార్యదర్శులు గుర్రపు శ్రీనివాస్‌, గంగమోహన్‌, సుధాకర్‌రెడ్డి, ప్రవీణ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, కారోబార్లు సంతోష్‌, క్రాంతి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పన్ను బకాయిలు వసూలు చేస్తున్నారు.

Read More »

దళితులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్‌ ఆరోపించారు. బిజెపి జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల సాగుభూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 4 వేల 600 మందికి మాత్రమే మంజూరు చేశారని, 2017-18 సంవత్సరంలో 10 వేల ఎకరాలు కొనుగోలు చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో ...

Read More »

సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్‌ విధానం రద్దుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఇప్పకాయల సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. సిపిఎస్‌ విధానం ద్వారా ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్‌లు కోల్పోతున్నారని, సిపిఎస్‌ రద్దుచేసి ఓపిఎస్‌ యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తపస్‌ ప్రధానకార్యదర్శి రామకృష్ణారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.  

Read More »

నగర అభివృద్ది పనులను సమీక్షించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులను అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త మంగళవారం అర్ధరాత్రి పరిశీలించారు. నగరంలో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మిషన్‌ భగీరథ, రోడ్లు పునర్నిర్మాణం పనులపై అధికారులతో పర్యవేక్షించి అన్ని శాఖలను సమన్వయ పరిచారు. నగర ప్రజలు పనులవల్ల కొంత ఇబ్బంది పడుతున్నారని, వీలైనంత త్వరలో పనులు పూర్తిచేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మునిసిపల్‌ కమీషనర్‌ జాన్సన్‌, డిఇ, ...

Read More »