Breaking News

కాల్‌సెంటర్‌ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌ ప్రాంతంలో ఎస్‌కెఎస్‌ అనే కాల్‌సెంటర్‌ సంస్థను స్థాపించి నిరుద్యోగుల వద్దనుంచి ఒక్కొక్కరినుంచి రూ. 20 నుంచి 30 వేల వరకు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులను 4వ టౌన్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో కాల్‌సెంటర్‌ సంస్థను ప్రారంభించి నిరుద్యోగ యువత నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్‌ పోలీసులు సంస్థ నిర్వాహకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Check Also

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *