Breaking News

Daily Archives: February 3, 2018

ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత మంత్రి హ‌రీశ్ స‌మావేశ‌o

నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గంలో ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను మంజూరు చేసి, నిధుల‌ను కూడా మంజూరు చేయాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఇరిగేష‌న్‌, మార్కెటింగ్ శాఖ‌ల మంత్రి హ‌రీశ్ రావును కోరారు. ఈ మేర‌కు నియోజ‌క వ‌ర్గాల వారీగా ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రికి అంద‌జేశారు. శ‌నివారం హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో ఎంపి క‌విత మంత్రి హ‌రీశ్ రావుతో స‌మావేశ‌మ‌యి సాగునీటి ప్రాజెక్టులు, కొత్త‌గా ఆయ‌క‌ట్టు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ప్ర‌స్తుత ఆయ‌క‌ట్టుకు సాగునీటి స్థిరీక‌ర‌ణ‌పై చ‌ర్చించారు. నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌లు.. బోధన్ నియోజ‌క ...

Read More »

డిసిపిల ఆగడాలను అరికట్టాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో కొంతమంది డాక్టర్‌ ఇన్‌ క్లినికల్‌ పాథోలాజికల్‌ లు జిల్లా కేంద్రంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తు వైద్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా ల్యాబ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డికి వినతి పత్రం అందించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. డిసిపిలు కొంతమంది వైద్యులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వారి ఆగడాలకు భయపడి వైద్యులు ల్యాబులను సంప్రదించకుండా డిసిపిల వద్దే రక్తపరీక్షలు నిర్వహించుకుంటున్నారని, తాముకూడా ...

Read More »

గాయత్రీ బ్యాంక్‌కు ఉత్తమ కస్టమర్‌ సర్వీసు అవార్డు

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గాయత్రీ బ్యాంకుకు ఉత్తమ కస్టమర్‌ సర్వీసు అవార్డును జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అందజేశారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో జేసి అవార్డును బ్యాంకు ప్రతినిది సత్యం శ్రీనివాసులు రెడ్డికి అందజేశారు. ఉత్తమ కస్టమర్‌ సర్వీసు ఒకేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డును అందించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు జైపాల్‌రెడ్డి, హరిస్మరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి రైల్వేస్టేషన్‌లో శనివారం ఆర్‌పిఎఫ్‌ ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు ఆకస్మిక తనికీ చేశారు. ప్లాట్‌ఫారాలను స్టేషన్‌ పరిసరాలను తనిఖీ చేశారు. రైళ్ళ రాకపోకల వివరాలను ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. అంతకుముందు రైల్వే ఔట్‌ పోస్టు పోలీస్‌ స్టేషన్‌లో తనిఖీలు చేశారు. ప్రయాణీకుల వద్దకెళ్ళి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదుల బ్యాగులను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే సిబ్బంది గన్‌ నాయక్‌, వెంకటరాం ...

Read More »

విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటని ఏఐఎస్‌ఎప్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్‌ అన్నారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి యూనివర్సిటీకి కనీసం రూ. 50 లక్షలు కూడా ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బడ్జెట్‌లో అధిక శాతం విద్యకు కేటాయించాల్సి ఉండగా కొఠారి కమీషన్‌ 65 శాతం ఇవ్వాలని గతంలోనే చెప్పినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. బడ్జెట్‌ కార్పొరేట్‌ ...

Read More »

బీబీపేటలో నేత్రదానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీబీపేటలో రాములు (82) మృతి చెందగా మృతుని కుమారుడు ఆంజనేయులు ఆమోదంతో నేత్రదానం చేశారు. వాసవీ క్లబ్‌ బీబీపేట ఆధ్వర్యంలో డాక్టర్‌ హనుమయ్య సహకారంతో మృతుని నేత్రాలు సేకరించి వాసన్‌ ఐకేర్‌ కంటి ఆసుపత్రికి అందించామని నేత్రకమిటీ అధ్యక్షుడు బాశెట్టి నాగేశ్వర్‌ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ప్రతినిధులు శ్రీనివాస్‌, మనోజ్‌, పి.శ్రీనివాస్‌, బాలరాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

అంగన్‌వాడి సెంటర్లకు కుర్చీల వితరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు భరత్‌రోడ్డులోగల అంగన్‌వాడి కేంద్రానికి కౌన్సిలర్‌ కుంభాల రవి యాదవ్‌ శనివారం 30 కుర్చీలను వితరణ చేశారు. అంగన్‌వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులు నేలపై కాకుండా కుర్చీల్లో కూచొని చదువుకోవడానికి వీలుంటుందని కుర్చీలు అందజేసినట్టు తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు తనవంతుగా కుర్చీలు అందజేసినట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రవి యాదవ్‌, కేంద్ర నిర్వాహకురాలు మంజుల, భవాని, శాంతి, ...

Read More »

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శనివారం తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని నగర మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. జిల్లా కేంద్రంలోని వుమెన్స్‌ కళాశాలలో నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్‌ వ్యవస్థ అవగాహన సదస్సుకు శనివారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఎవరికి తీసిపోరని, అన్ని రంగాల్లో రాణించి ప్రపంచఖ్యాతిని గడించాలని, ఇపుడు మహిళలు విద్య, వైద్య, వైజ్ఞానిక రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారని, మహిళలు రాజకీయాల్లో ఎంత క్రియాశీలకంగా ఉంటే అంత మంచి ...

Read More »

బడ్జెట్‌ ప్రతుల దహనం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతులను జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌ వద్ద శనివారం దగ్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు తాహెర్‌ బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్‌ను నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బడ్జెట్‌ ప్రతులను దహనం చేశామని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. అంగన్‌వాడి, ఆశ వర్కర్లకు, రైతులకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రయోజనం ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు వికాస సమితి 2018 క్యాలెండర్‌ను జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి నిజామాబాద్‌ ఆర్డీఓ వినోద్‌కుమార్‌, నగర సిఐ సుభాష్‌చంద్రబోస్‌, సమాచారహక్కు వికాస సమితి కన్వీనర్‌ జానకిరాజా, ఉపాధ్యక్షుడు సుమన్‌రెడ్డి, హెచ్‌.గణేశ్‌, నాగరాజు, వరప్రసాద్‌, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పసుపు రైతులకు రైతుబంధు పథకం వర్తింపు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు రైతులకు రైతుబంధు పథకం వర్తింప చేస్తున్నట్టు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శనివారం ఎంపి కవిత బృందంతో సమావేశమైన మంత్రి ఎంపి విజ్ఞప్తి మేరకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్‌ సౌకర్యాలు, ఇతర అంశాలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్షించామని, పసుపు పంట చేతికొచ్చే సమయానికి ధర పడిపోతున్న నేపథ్యంలో ఎంపి కవిత ...

Read More »

చట్టాలపై అవగాహన అవసరం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సూర్యచంద్రకళ అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం -2005 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. సమాచార హక్కు చట్టం వల్ల సామాన్యునికి న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్కరు దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చట్టం కార్యకర్తలను ప్రోత్సహించాలని ఆమె అన్నారు. సమాచారహక్కు చట్టం వికాస ...

Read More »

మహాగణపతి ఆలయంలో సంకట హర చతుర్థి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద గల మహా గణపతి ఆలయంలో శనివారం సంకట హర చతుర్థిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూర సమర్పణ, గరికపూజ, గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ భూషణ్‌చారి, పూజారులు రాజీవ్‌శర్మ, రాజు, సత్యం, శ్రీనివాస్‌, మురళి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »