Breaking News

Daily Archives: February 10, 2018

కామారెడ్డి బల్దియా అవినీతిపై విచారణ చేపట్టాలి

  కామరెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియాలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర స్తాయి ఆడిట్‌ అధికారుల తనిఖీలో రూ. 10 కోట్ల మేర దుర్వినియోగం జరిగినట్లు విచారణలో వెల్లడైందన్నారు. సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై చర్యలు చేపట్టాలన్నారు. నిదులను రికవరి చేసి పట్టణాభివృద్దికి కేటాయించాలన్నారు. కార్మికుల పేరుతో డబ్బులు తీసుకున్న అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ప్రతినిధులు దశరథ్‌, ...

Read More »

పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం టేక్రియాల్‌లోని జడ్పిహెచ్‌ఎస్‌లో గణితస్పూర్తిపై ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థుళకు గణితశాస్త్రంలో మెరుగైన శిక్షణ అందించడానికి రిసోర్సు పర్సన్‌ ఆధ్వర్యంలో తయారుచేసిన మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్తులకు అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులు తమకున్న వనరులను ఉపయోగించుకొని ఏకాగ్రతతో చదివి విజయం ...

Read More »

ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఇందూరు క్యాన్సర్‌ ఆసుపత్రి, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా శనివారం కామరెడ్డిలో ఉచిత మెడికల్‌ చెకప్‌ శిబిరం నిర్వహించింది. దీనికి భారత్‌గ్యాస్‌ చేయూతనందించింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత్‌గ్యాస్‌ స్వచ్చంద సంస్థలతో కలిసి శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. ఒత్తిడి ద్వారా ప్రజల్లో అనేకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆరోగ్య పరీక్షలు చేసుకొని తద్వారా ...

Read More »

మార్చి 7న గురుపట్టాభిషేక మహోత్సవం

  కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మార్చి 7న 14వ శ్రీగురుపట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆర్యవైశ్య సంఘం ప్రతినిదులు తెలిపారు. 108 యజ్ఞ కుండాలతో మహాయజ్ఞం నిర్వహిస్తారన్నారు. మార్చి 5న మహా బైక్‌ ర్యాలీతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మార్చి 7 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట తదితర కార్యక్రమాలు రూపొందించినట్టు తెలిపారు. ముఖ్య అతిథిగా శ్రీ సంస్థాన్‌ హల ద్విపుర వైశ్యమఠాధిపతి పరమపూజ్య వామనాశ్రమ ...

Read More »

పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తాం

  కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ భూంరెడ్డి అన్నారు. కామరెడ్డి జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ళ పురోగతిపై శనివారం ఛైర్మన్‌ క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీతోపాటు లింగాయిపల్లి గ్రామాన్ని సందర్శించి పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి అవసరమైన ఆహారం, నీరు, నివాసం సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పిస్తుందన్నారు. జిల్లాలో ...

Read More »

ఘనంగా మంత్రి పోచారం జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలను బాన్సువాడ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాన్సువాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి 69 కిలోల కేక్‌ కట్‌ చేశారు. కామరెడ్డి జిల్లా రైస్‌మిల్లర్స్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేశారు. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ, అభిమానులు ...

Read More »

మాంసం దుకాణాలను తమకే కేటాయించాలి

  కామరెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాంసం దుకాణ సముదాయాన్ని తమకే కేటాయించాలని ఆరె కటిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, ప్రతినిధులు రతన్‌, బాలాజీ, కన్నయ్యలు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా తమకే ఈ దుకాణాలు ఉన్నాయని, మునిసిపల్‌ కమీషనర్‌ టెండరు ప్రకటన పెట్టడం శోచనీయమన్నారు. వందలాది కుటుంబాలు మాంసం అమ్మకాలపై ఆధార పడి జీవిస్తున్నాయన్నారు. టెండరు రద్దు చేసి దుకాణాలను తమకే కేటాయించాలన్నారు. లేకుంటే అన్ని ...

Read More »

మాజీ జడ్పి ఛైర్మన్‌ తండ్రి మృతి

  కామరెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ జడ్పి ఛైర్మన్‌ కాటిపల్లి రమణారెడ్డి తండ్రి రాజిరెడ్డి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గతంలో రాజిరెడ్డి పంచాయతీ సమితి అధ్యక్షునిగా, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌గా, తాడ్వాయి మండలంలో పలు కీలక పదవులు నిర్వహించారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తులకు సంబందించిన కమిటీలో కన్వీనర్‌గా కూడా పనిచేశారు. శనివారం తాడ్వాయి మండలంలోని దేనెకలన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు రమణారెడ్డిని ఫోన్లో పరామర్శించారు. ...

Read More »

మద్యం అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలి

  కామరెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వైన్‌షాపుల్లో మద్యం ప్రియులకు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం స్తానిక ఎక్సైజ్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆదేశాల మేరకు లిక్కర్‌ ప్రైస్‌ మోబైల్‌ యాప్‌ విడుదల చేశారు. దీంట్లో 880 రకాల మద్యం ధరలు అందుబాటులో ఉంటాయన్నారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తే వాట్సాప్‌ నెంబరు 7989111222కు, ఉచిత ఫోన్‌ కాల్‌ నెంబరు 1800 425 2523 ...

Read More »