Breaking News

Daily Archives: February 12, 2018

ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరిస్తు గోడప్రతులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరిస్తు భజరంగ్‌దళ్‌ కామరెడ్డి ఆద్వర్యంలో రూపొందించిన గోడప్రతులను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ తత్వాన్ని విడనాడాలని, స్వదేశీ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, రవి, సతీష్‌, అమర్‌, సాయి, రాజు, అరవింద్‌, వెంకట్‌, భాను, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏఐఎఫ్‌డివై ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎఫ్‌డివై ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేపట్టినట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, నాయకుడు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటికో హామీ ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని తెరాస, కేంద్రంలోని బిజెపి సర్కారు సంవత్సరంలో రెండుకోట్ల ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చి ఇప్పటివరకు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ...

Read More »

ఆలయాల్లో ఏర్పాట్లపై దృష్టి సారించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శివరాత్రి మహా పర్వదినాన్ని జిల్లాలోని 63 శైవ క్షేత్రాల్లో ఆయా శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ భవనంలో కన్వర్జెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్‌, మునిసిపాలిటీ, ఆరోగ్యశాఖ, ఎలక్ట్రిసిటి తదితర శాఖాధికారులు అన్ని ఆలయాల్లో భక్తుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. గాంధారి మండలం నేరెల్‌ తాండాలో ఓహెచ్‌బిఆర్‌ ఏర్పాటును వెంటనే పూర్తిచేయాలన్నారు. రూర్బన్‌ పథకంలో భాగంగా ఎల్‌ఇడి బల్బులు, ...

Read More »

దొంగ అరెస్టు – రూ.53 వేలు స్వాధీనం

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి డిఎస్‌పి ప్రసన్నరాణి తెలిపారు. కామరెడ్డి డిఎస్‌పి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుని ప్రవేశపెట్టి దొంగతన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ ఆద్వర్యంలో సిసిఎస్‌ ఎస్‌ఐ పెంటయ్య, ఏఎస్‌ఐ సంతోస్‌రెడ్డి, ఏఎస్‌ఐ ఉస్మాన్‌, సిబ్బందికి అందిన సమాచారం మేరకు సోమవారం రామారెడ్డి గ్రామంలో రాతల గైని వద్ద వాహనాల ...

Read More »

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21 నుంచి 25 వరకు బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మూెత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తెలంగాణ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కొండమీదకు బస్సు సౌకర్యంతోపాటు బాన్సువాడ, బీర్కూర్‌ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. ...

Read More »

మహాశివరాత్రికి ముస్తాబైన శైవ క్షేత్రాలు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలోగల నీలకంఠేశ్వరాలయం, శంభుని గుడి ఆలయం, వినాయక్‌నగరలోని శివాలయం, గంజ్‌ ప్రాంతంలోని ఉమామహేశ్వరాలయం అందంగా ముస్తాబు చేశారు. అదేవిధంగా ఆర్మూర్‌ సమీపంలోని సిద్దులగుట్ట నవనాథ ఆలయం, నందిపేట కేదారేశ్వరాలయం, బోధన్‌ ఏకచక్రేశ్వరాలయం,నగర శివారులోని నందిగుడితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శివాలయాలు అందంగా తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు.

Read More »

రోగులకు మెరుగైన సేవలందించాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ రోగులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని, సకాలంలో స్పందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సర్కారు దవాఖానాలను నమ్ముకొని వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చి మందులు అందజేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ...

Read More »

కుష్టువ్యాధి రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  – లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ గాంధారి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుష్టువ్యాధి రహిత సమాజాన్ని నిర్మిద్దామని గాంధీజి కలలు సాకారం చేద్దామని గాంధారి జడ్పిటిసి తానాజీరావు అన్నారు. సోమవారం మండలంలోని వండ్రికల్‌ లెప్రసీ క్యాంప్‌లో లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో స్పర్శ కుష్టు వ్యాధి నిర్మూలనా దినోత్సవాన్ని నిర్వహించారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. లయన్స్‌ క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షుడు వాసవి రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి జడ్పిటిసి తానాజీరావు ముఖ్య ...

Read More »

పోతంగల్‌ గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలం పోతంగల్‌ గురుకుల పాఠశాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని పేరెంట్స్‌ కమిటీ ప్రతినిది సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఈ అంశంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఎటువంటి స్పందన లేదని ఆయన ఆరోపించారు. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయని, ...

Read More »

అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో తమ భూమిని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేటర్‌ షకీల్‌పై చర్యలు తీసుకొని అట్టి అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని బాధితుడు ఏ.ఆనంద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బాధితుడు కుటుంబీకులతో కలిసి ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు పిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అంశంపై తాము పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నామని, ప్రజావాణి నుంచి సంబందిత అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయని, ఈ అంశంపై స్పందించిన మునిసిపల్‌ ...

Read More »

రైతులకు ఇక ఇబ్బందులు ఉండవు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు సంబంధించిన భూముల విషయంలో ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తహసీల్దార నాగరాజుగౌడ్‌ అన్నారు. హసన్‌పల్లి గ్రామంలో సోమవారం రైతులకు 1-బి ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని, రైతులకు మీ సేవా ద్వారా పహణీ పత్రాలను ఎప్పుడు తీసుకున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. 70 సంవత్సరాల్లో ఇలాంటి ...

Read More »

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని మండల విద్యాధికారి బలిరాం రాథోడ్‌ అన్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం ప్రార్థన సమయానికి హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న బోధన, మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, రుచికరమైన ఆహార పదార్థాలు వడ్డించాలని ఏజెన్సీ వారికి సూచించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు భూమయ్య, ఉపాధ్యాయులు ...

Read More »

15న సేవాలాల్‌ జయంతి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీన సేవాలాల్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు అఖిలభారతీయ బంజారా సేవా సంఘ్‌ రాష్ట్ర సలహాదారులు, జాతీయ బంజారా డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి డాక్టర్‌ మోతిలాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 279వ జయంతిని పురస్కరించుకొని భోగ్‌ భండార్‌ నిర్వహించుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆయన తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ అని, అతను చూపించిన సన్మార్గంలో బంజారాలు నడుచుకొని ప్రజలందరికి ఆదర్శప్రాయం కావాలని ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 12 ఫిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి 12 పిర్యాదులు అందాయి. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు తమ సమస్యలను కమీషనర్‌కు విన్నవించారు. సమస్యలను ఆయా స్టేషన్‌ అధికారులకు పంపి బాధితులకు న్యాయం చేస్తామని కమీషనర్‌ కార్తికేయ తెలిపారు.

Read More »