Breaking News

Daily Archives: February 13, 2018

భిక్కనూరు సిద్దరామేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశిగా పేరుగాంచిన భిక్కనూరులోని సిద్ద రామేశ్వరాలయంలో మంగళవారం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూ సిద్ది రామేశ్వర ఆలయంలో ఈ సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెరాస నేతలు నిట్టు వేణుగోపాల్‌రావు, నంద రమేశ్‌, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, మామిళ్ళ రమేశ్‌, సాయి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

టియుడబ్ల్యుజె డైరీ ఆవిష్కరణ

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియుడబ్ల్యుజె కామారెడ్డి జిల్లా 2018 డైరీలను జిల్లా అధ్యక్షుడు లతీఫ్‌ మంగళవారం నిజాంసాగర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించేవిధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్లు, అక్రిడేషన్‌ కార్డులు ఇప్పించేవిధంగా ప్రయత్నం చేస్తామన్నారు. జర్నలిస్టులు ఏవిధమైన సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే చర్చించి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విలేకరులు సయ్యద్‌ మెరజుద్దీన్‌, ...

Read More »

బుగ్గరామేశ్వరాలయంలో షబ్బీర్‌ అలీ పూజలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శ్రీబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిదులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తాను ఆలయ అభివృద్ది కోసం పలుమార్లు నిధులు విడుదల చేశామన్నారు. ఆలయం అభివృద్ది చెందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలందరు సుఖ ...

Read More »

వాహన దారులకు జరిమానాలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని సుభాష్‌రోడ్డు చౌరస్తాలో మంగళవారం పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 20 మంది వాహనదారులకు రూ. 1200 జరిమానా విధించినట్టు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు ప్రతి ఒక్కరు రవాణా శాఖ నిబందనలు పాటించాలన్నారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ రాములు, సిబ్బంది ఉన్నారు.

Read More »

ప్రేమికుల దినోత్సవాన్ని బహిష్కరించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమికుల దినోత్సవాన్ని యువత జరుపుకోవద్దని, మన దేశ సంస్కృతిని దెబ్బతీసేవిధంగా వ్యవహరించవద్దని విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు రవి అన్నారు. ఇందులో భాగంగా ప్రేమికుల దినోత్సవ వ్యతిరేక గోడప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. విదేశీ సంస్కృతిని యువత అలవాటు చేసుకొని చెడు వైపు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో విహెచ్‌పి ప్రతినిధులు శ్రీనివాస్‌, రాకేశ్‌, సతీష్‌ తదితరులున్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో శివరాత్రి వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లోని శివాలయాల్లో మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనం కోసం ఆలయాలకు భారీగా తరలివెళ్లారు. భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ద రామేశ్వరాలయం, మద్దికుంటలోని బుగ్గ రామేశ్వరాలయం, జిల్లా కేంద్రంలోని శివకేశవాలయం, ఓంశాంతి తదితర ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పోలీసులు ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More »

విగ్రహాల పున: ప్రతిష్ట

  కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని పెద్దబజార్‌ చౌరస్తాలోని ఆలయంలో గత నెల 22వ తేదీన విఠలేశ్వర విగ్రహాలు చోరీ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌, కామారెడ్డి పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణ పోలీసు స్టేషన్‌ నుంచి ఆలయ కమిటీ ప్రతినిదులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్‌, సుభాష్‌రోడ్డు, గాంధీగంజ్‌ మీదుగా ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి పున: ప్రతిష్టించారు. ఆలయ కమిటీ అర్చకులు ...

Read More »