Breaking News

Daily Archives: February 14, 2018

యువకుడి రక్తదానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అత్యవసరంగా రక్తం అవసరం కాగా ఓ యువకుడు రక్తదానం చేశారు. రోగికి ఏ- పాజిటివ్‌ గ్రూప్‌ రక్తం అవసరం కాగా రోగి తరఫు బంధువులు కామారెడ్డి బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ను సంప్రదించారు. ఇస్రోజివాడికి చెందిన నరేశ్‌ అనే యువకుడు సమయానికి రక్తదానం చేసి రోగి ప్రాణాలను కాపాడారు.

Read More »

పది విద్యార్థులకు అల్పాహారం అందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ మాడల్‌ స్కూల్స్‌, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సిబిఎఫ్‌ నుంచి ప్రతిరోజుకు విద్యార్థికి రూ. 5 చొప్పున కేటాయిస్తు అల్పాహారం అందించేందుకు కలెక్టర్‌ ఆదేశించినట్టు తెలిపారు. ప్రతి విద్యార్తికి మజ్జిగతోపాటు అరటిపండ్లు లేదా స్నాక్స్‌ సరఫరా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. సంబంధిత ...

Read More »

నేటి నుంచి సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఈనెల 15 నుంచి శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు గిరిజన అభివృద్ది అధికారి ప్రేమ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 15న కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి శివబాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో, 15న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్‌ మండలం, లింగంపల్లిలోని జిఎన్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో, 16న బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, 17న జుక్కల్‌ నియోజకవర్గంలోని పెద్దకోడప్‌గల్‌ సొసైటీలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. ...

Read More »

గొర్రెల పంపిణీలో మొదటిస్థానంలో నిలిచినందుకు అభినందనలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలో లిస్టు-ఎ గొర్రెల పంపినీ పూర్తికాబడి 96 శాతం పంపిణీ చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానం సంపాదించడం పట్ల పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కలెక్టర్‌ను అభినందించారు. బుధవారం గొర్రెల పంపిణీ, చేపల ఉత్పత్తి అంశాలపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ యానిమల్‌ హస్బండరీ సందీప్‌కుమార్‌, సిఎం స్పెషల్‌ సెక్రెటరీ స్మిత సబర్వాల్‌, పశు సంవర్ధకశాఖ ...

Read More »

శనగకోత యంత్రంలో పండి బాలుడి మృతి

  గాంధారి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనగకోగ యంత్రంలో పడిన బాలుడి చేతు తెగిపోవడంతో బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం గాంధారి మండలంలో చోటుచేసుకుంది. మృతుని బంధువులు, సదాశివనగర్‌ సిఐ నాగరాజు కథనం ప్రకారం…మండలంలోని నేరల్‌ తాండాకు చెందిన రవి పోతంగల్‌ గ్రామ శివారులో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అందులో శనగపంట వేశాడు. పంట చేతికి రావడంతో శనగకోత యంత్రం ద్వారా శనగలు వేరు చేయడానికి యంత్రాన్ని చేనులోకి తీసుకెళ్లాడు. ఈక్రమంలో బుధవారం తన ...

Read More »

ఆర్యవైశ్య ఎన్నికల పట్ల వ్యాఖ్యలు సరికావు

  కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఆర్యవైశ్య ఎన్నికలకు సంబంధించి పార్శి కాంశెట్టి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆర్యవైశ్య సంఘం కామారెడ్డి ప్రతినిదులు ఓ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంశెట్టిపై రాష్ట్ర కమిటీకి పిర్యాదు చేసినట్టు తెలిపారు. సంఘం ప్రతినిదులు నాగేశ్వర్‌రావు, కైలాష్‌ శ్రీనివాస్‌రావులు తమ ప్రాంతానికి వచ్చి తమను బెదిరించినట్టు కాంశెట్టి ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. తామందరం కలిసే నాగేశ్వర్‌రావును జిల్లా అధ్యక్షునిగా పోటీ చేయమని చెప్పినట్టు పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు ...

Read More »

18,19 తేదీల్లో మైశమ్మ ఆలయ ఉత్సవాలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామ శివారులోని మైశమ్మ ఆలయం వద్ద ఈనెల 18,19 తేదీల్లో జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని మాగి జిఎస్‌ఆర్‌, సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండ్రోజులపాటు మైశమ్మ ఆలయంలో బోనాల పండుగ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఇంటినుంచి బోనం తీసి అమ్మవారికి సమర్పిస్తారన్నారు. 19న కుస్తీ పోటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోటీలకు మల్లయోధులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సూచించారు.

Read More »

19న మండల సర్వసభ్య సమావేశం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఎంపిడిఓ కార్యాలయంలో మండల సర్వసభ్యసమావేశం ఈనెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. ఎంపిపి సునంద అధ్యక్షతన జరుగు ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు. ఈనెల 16న ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలను ఎంపిడివో కార్యాలయంలో అందజేయాలన్నారు. సమావేశానికి జడ్పిఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే హాజరవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మండల కో ...

Read More »

సేవాలాల్‌ జయంతికి తరలిరావాలి

  గాంధారి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలకు పెద్దఎత్తున గిరిజనులు తరలిరావాలని గాంధారి మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సేవాలాల్‌ చౌరస్తా వద్ద విలేకరులతో మాట్లాడారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ 279వ జన్మదిన వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గురువారం లింగంపేట్‌ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఉదయం గాంధారి మండల కేంద్రంలో సేవలాల్‌ జయంతి నిర్వహించి లింగంపేట్‌ ...

Read More »