Breaking News

Daily Archives: February 16, 2018

ఉద్యోగుల బహిరంగ సభ విజయవంతం చేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రిబ్యుటరీ పెన్షన్‌ స్కీం విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తు మార్చి 25న నిర్వహించనున్న ఉద్యోగుల భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని టివిఆర్‌వోడబ్ల్యుఎల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రావు అన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్సన్‌ విధానం అమలు చేయాలని సభ తలపెట్టినట్టు తెలిపారు. కొత్త పెన్షన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 25 వేల మంది సిపిఎస్‌ ఉద్యోగులు ఉన్నారన్నారు. రాష్ట్ర ...

Read More »

మార్చి 15 నాటికి భూ సేకరణ పనులుపూర్తిచేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే అథారిటి ఆఫ్‌ ఇండియా నేషనల్‌ హైవే రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా మార్చి 15 నాటికి భూసేకరణ పనులు పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటైన వీడియో కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ద్వారా 8 వేల కోట్లు, ఎన్‌హెచ్‌ఐఎ, ఎన్‌హెచ్‌ పనులకు మంజూరు ...

Read More »

సంచారజాతులకు ఉపాధి శిక్షణా కోర్సులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంచార జాతుల వారికోసం వివిద కోర్సుల్లో ఉపాధి శిక్షణ నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి జనహితలో శుక్రవారం నిర్వహించిన సంచార జాతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సంచార కుల జాతులకు ప్రభుత్వం రూ. 800 కోట్లను కార్పొరేషన్‌ ద్వారా అందిస్తుందన్నారు. 36 సంచార జాతులకు చెందిన వారికి ఎలక్ట్రిషియన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, డిటిపి తదితర నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వారి పిల్లల కోసం ...

Read More »

గిరిజనులపై ప్రభుత్వం సవతి ప్రేమ

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనులపై ప్రబుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని మంత్రి సమక్షంలో సేవాలాల్‌ జయంతి సాక్షిగా గిరిజనులను వేధించి అరెస్టు చేయడం దీనికి నిదర్శనమన్నారు. ఎంసిపిఐయు జిల్లా కన్వీనర్‌ జబ్బర్‌నాయక్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మాచారెడ్డి మండలంలోసేవాలాల్‌ జయంతి సందర్బంగా రాజకీయ నాయకులు గిరిజనుల మద్యలో తమ స్వార్థం కోసం రెండు వర్గాలుగా విభజించి లొల్లి పెట్టి లాఠీచార్జి చేయడమే కాకుండా అరెస్టుకు కారణమన్నారు. ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి గిరిజనులపై దాడిచేసి ...

Read More »

జిల్లాలో మత్స్యవనరులు పెంపొందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో చేప సీడ్‌ను పెంచి జిల్లా మత్స్య కమ్యూనిటికి ఆదాయ వనరుగా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబరులో మత్స్య, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపల ఉత్పాదకతను పెంచి మత్స్యకారులు మార్కెటింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యశాఖను బలోపేతం చేయడానికి జిల్లాకు రూ. 23 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఐఎఫ్‌డిఎస్‌ ద్వారా దశల వారిగా ...

Read More »

మిషన్‌ భగీరథ పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని ప్రతి ఇంటికి శుద్దమైన వందలీటర్ల నీటిని అందించేందుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకోసం పనులు వేగవంతం చేయాలని మిషన్‌ భగీరథ డిఇ వెంకటస్వామి అన్నారు. మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో జరుగుతున్న పైప్‌లైన్‌ పనులను డిఇ, ఎ.ఇ శివకుమార్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు ద్వారా జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గ ప్రజలకు నీటిని అందించేందుకోసం ప్రభుత్వం కృషి ...

Read More »

ప్రతి ఒక్కరు ఐదు మొక్కలు నాటాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి వ్యక్తి ఐదు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. వాటరింగ్‌ డే లో భాగంగా శుక్రవారం రామారెడ్డి మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు. 33 శాతం పచ్చదనం ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దేశంలో 25 శాతం మాత్రమే మొక్కలున్నాయని, తెలంగాణలో 22 శాతమే ఉన్నాయన్నారు. చెట్లు లేకపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం అందుకే హరితహారం ...

Read More »

రోడ్డు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు బొగ్గు గుడిసె వైపు నుంచి పిట్లం వైపు వెళుతున్న ఓ లారీ ఎంపి 09 హెచ్‌జి 0559 చిన్నారిని ఢీకొనడంతో ఎడమ కాలికి తీవ్రంగా గాయలైనట్టు ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… నిజాంసాగర్‌ మండల కేంద్రానికి చెందిన మల్లవ్వ, సిద్దప్ప దంపతులకు చెందిన చిన్నారి సంధ్య రోడ్డు దాటుతుండగా లారీ అకస్మాత్తుగా ఢీకొనడంతో తీవ్ర ...

Read More »