Breaking News

Daily Archives: February 18, 2018

మాజీ సైనిక సంఘం బలోపేతానికి కృషి

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ సైనికుల సంక్షేమానికి మాజీ సైనిక సంఘం తమవంతు కృషి చేస్తుందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, బాలకిషన్‌, జనార్ధన్‌లు అన్నారు. ఆదివారం కామారెడ్డిలోని రెడ్డి సంక్షేమ భవనంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాలోని మాజీ సైనికులు హాజరయ్యారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలు, ...

Read More »

ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కెజి నుంచి పిజి మిషన్‌లో భాగంగా సంక్షేమ వసతి గృహాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెనకబడిన సంక్షేమాధికారులు తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ : ఏప్రిల్‌ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటుందన్నారు. ...

Read More »

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భజన కార్యక్రమాలను గ్రామాల్లో విస్తరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత ప్రాచుర్యాన్ని జానపద కళాకారులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. ఆదివారం కామరెడ్డిలో తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భజన పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భజన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలన్నారు. జానపద కళాకారులకు ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ, ఇన్సురెన్సు వర్తింపజేసేలా చర్యలు ...

Read More »

సిపిఎస్‌ రద్దుకోసం 27న జిల్లా కేంద్రంలో ధర్నా

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్‌ ఆధ్వర్యంలో సిపిఎస్‌ రద్దుకోసం ఈనెల 27న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్టు ఏబిఆర్‌ఎస్‌ఎం జాతీయ ఉపాధ్యక్షుడు పాలేటి వెంకట్రావు అన్నారు. ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబిఆర్‌ఎస్‌ఎం కేంద్రం సహాయంతో హర్యానా రాష్ట్రంలో సిపిఎస్‌ను రద్దుచేయించినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సిపిఎస్‌పై శాసనసభలో తీర్మానం చేయకపోవడం ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినపుడే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ...

Read More »

కుమ్మర శాలివాహన సంఘం కార్యవర్గం

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి మండలం కుమ్మర శాలివాహన సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. దేవునిపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో కుమ్మరుల సమస్యలపై చర్చించారు. కుమ్మరులందరు ఏకతాటిపైకి వచ్చినపుడే అభివృద్ది చెందుతామని సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యక్షునిగా సుదర్శన్‌, సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా రవి, కోశాధికారిగా అనిల్‌, సహాయ కార్యదర్శులుగా నరేందర్‌, భూమయ్య, సలహాదారులుగా రాజశేఖర్‌, కార్యవర్గ సభ్యులుగా నర్సవ్వ, నాగరాజు, ...

Read More »

పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రాంతంలోని పౌల్ట్రీ రంగానికి సంబంధించిన చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతినిదులు వెంకట్‌రావు, జనార్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రావులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని కంపెనీల వల్ల చిరు పౌల్ట్రీ వ్యాపారులు ఆర్తికంగా దెబ్బతింటున్నారని పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగంలో తక్కువ ధరలు ఉండడంతో నష్టపోతున్నామని వాపోయారు. ఈ విషయంపై రాష్ట్రానికి సంబంధించిన పౌల్ట్రీ రంగ ప్రతినిదులతో పాటు ప్రభుత్వానికి వినతి పత్రం ...

Read More »

యువకుడి ఆత్మహత్య

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడికి చెందిన నరేశ్‌ (19) ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం ఉరివేసుకొని మృతి చెందినట్టు తాడ్వాయి పోలీసులు తెలిపారు. జీవితంపై విరక్తి చెందిన నరేశ్‌ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసినట్టు తెలిపారు.

Read More »

రూ.42 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 65 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. శనివారం 65 మంది లబ్దిదారులకు రూ. 42 లక్షల కళ్యాణలక్ష్మి చెక్కులు, 15 మందికి 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి ...

Read More »

ఆలయ నిర్మాణానికి నిధుల కోసం వినతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంపూర్తిగా ఉన్న కాలికాదేవి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు విశ్వకర్మ ప్రతినిధులు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళికాదేవి మందిరం, బ్రహ్మంగారి మందిరం పిల్లర్ల లెవల్‌ వరకు నిర్మాణం జరిగి ఆగిపోయిందన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించనందున నిర్మాణాన్ని ఆపేశామని చెప్పారు. విశ్వకర్మ సంఘం కమ్యూనిటి భవనానికి ప్లాస్టరింగ్‌, ఫ్లోరింగ్‌ కోసం ఆలయాల నిర్మాణాల కోసం, మందిరానికి బోరు ...

Read More »