Breaking News

ఆలయ నిర్మాణానికి నిధుల కోసం వినతి

 

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంపూర్తిగా ఉన్న కాలికాదేవి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు విశ్వకర్మ ప్రతినిధులు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళికాదేవి మందిరం, బ్రహ్మంగారి మందిరం పిల్లర్ల లెవల్‌ వరకు నిర్మాణం జరిగి ఆగిపోయిందన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించనందున నిర్మాణాన్ని ఆపేశామని చెప్పారు. విశ్వకర్మ సంఘం కమ్యూనిటి భవనానికి ప్లాస్టరింగ్‌, ఫ్లోరింగ్‌ కోసం ఆలయాల నిర్మాణాల కోసం, మందిరానికి బోరు మోటారు కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిదులు వెంకటస్వామి, భూమయ్య, వెంకటేశం, సింహం, సంతోష్‌, నవీన్‌, గురుమూర్తి, రాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Check Also

31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ...

Comment on the article