Breaking News

Daily Archives: February 19, 2018

గల్ఫ్ బాధితులకు ఎంపీ కవిత ఆపన్న హస్తం.

  క్షమాభిక్ష అర్హులందరికీ విమాన టికెట్లు. అందరిని క్షేమంగా ఇంటికి చేరవేయమని జాగృతి శాఖలకు ఆదేశాలు.   నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19   నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కువైట్‌ దేశంలో అక్రమంగా పర్మిట్‌ వీసా లేకుండా శిక్షపడ్డ తెలంగాణ కార్మికులకు కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించిన విషయం తెలిసిందే. గల్ప్‌ జైళ్ళలో మగ్గుతున్న తెలంగాణ కార్మికులకు స్వదేశానికి రప్పించేందుకు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.     కువైట్‌ ...

Read More »

తెగిన సంకెళ్ళు

  – కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కువైట్‌ దేశంలో అక్రమంగా పర్మిట్‌ వీసా లేకుండా శిక్షపడ్డ తెలంగాణ కార్మికులకు కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ, ఐటి శాఖ మంత్రి తారకరామారావు కువైట్‌ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గల్ప్‌ జైళ్ళలో మగ్గుతున్న తెలంగాణ కార్మికులకు స్వదేశానికి రప్పించేందుకు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అందుకు తగిన ఏర్పాట్లు ...

Read More »

కలెక్టరేట్‌ నూతన భవన నిర్మాణాల పనుల పరిశీలన

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం నిర్మాణ పనులను జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. భవనం పనులు ప్రాథమిక స్థాయిలో పూర్తికానున్నాయని అన్నారు. అడ్లూర్‌ శివారులో నిర్మిస్తున్న భవనం ఫుటింగ్స్‌ పనులు పూర్తయ్యాయని, మార్చినెలలో మొదటి స్లాబ్‌ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఆయన వెంట ఎస్‌.సి ఎలక్ట్రిసిటి శేషారావు, ఆర్‌అండ్‌బి ఇఇ ఆంజనేయులు, డిఇ శ్రీనివాస్‌, జేఇ సుధీర్‌, ప్రాజెక్టు మేనేజర్‌ రామన్‌ తదితరులున్నారు.

Read More »

కల్తీ పెట్రోల్‌పై ఆందోళన

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండల కేంద్రంలో పెట్రోల్‌ పంప్‌ నిర్వాహకులు కల్తీ పెట్రోల్‌ను విక్రయిస్తున్నారని స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. బంక్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బాల్లో పెట్రోల్‌ తీసుకెళ్ళి చూయించారు. పెట్రోల్‌లో అధిక శాతం నీరు, ఇతర ఇంధనం మిలితమై ఉంటున్నాయని, దానివల్ల వాహనాలు చెడిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాదికారులు వీటిపై స్పందించి బంక్‌ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read More »

కాయకల్ప అవార్డుకు ఎంపికైన వైద్యులకు సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాయకల్ప అవార్డుకు ఎంపికైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సన్మానించారు. సోమవారం జనహితలో ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ అవార్డు గ్రహీతలైన వైద్యులు డాక్టర్‌ అజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, తిరుమలేశ్‌, రాజా, సుష్మితలను జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు. వారికి గ్రంథాలయ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పుస్తకాలను బహుకరించిన ఆడిట్‌ అధికారి విజయలక్ష్మి, రచయిత సిరిగాద శంకర్‌లను సన్మానించారు. సమావేశంలో జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల, ఆర్డీవో ...

Read More »

రవాణా శాఖ కార్యాలయం తనిఖీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని సోమవారం జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌ హైదరాబాద్‌ పాండురంగ నాయక్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఇన్స్‌పెక్టర్లు, టార్గెట్‌ వివరాలు, చెక్‌పోస్టుల పనితీరు, సిబ్బంది పనితీరు, తదితర విషయాలపై ఆరా తీశారు. సిబ్బంది సక్రమంగా పనిచేయాలని, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని, రవాణా వ్యవస్థను పటిష్ట పరచాలని సూచించారు.

Read More »

ప్రగతిపనులపై కలెక్టర్‌ సమీక్ష

19 కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్ష జరిపారు. రూర్బన్‌ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో వీధి దీపాల ఏర్పాటు, వివిద అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. ఇందిర జలప్రభ కింద లబ్దిదారులకు మోటార్లను అందజేయాలన్నారు. బాగిర్తిపల్లి, ఎల్లమ్మ తాండాల్లో ప్రత్యేక నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భవిత సెంటరు రిక్రూట్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. లీడ్‌ బ్యాంక్‌ ...

Read More »

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లిలో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్‌జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యక్షత్రియ సంఘం, ఆర్యక్షత్రియ యువ పరివార్‌, భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌, యువజనసంఘాల ఆధ్వర్యంలో కామరెడ్డి నుంచి దేవునిపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం శివాజీ మహరాజ్‌ విగ్రహనికి, భవానిమాతకు పూలమాలలువేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యక్షత్రియ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నిట్టు వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శివాజీ అడుగుజాడల్లో నడిచి ...

Read More »

ప్రజావాణిలో 52 ఫిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 52 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. రెవెన్యూ-15, ఎస్‌సి కార్పొరేషన్‌-6, పంచాయతీ రాజ్‌ – 4, మత్స్యశాఖ-2, పోలీసు-2, కో ఆపరేటివ్‌-2, గిరిజనశాఖ-2తో పాటు వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సంబంధిత అధికారులకు ఫిర్యాదులను పంపారు. కార్యక్రమంలో డిఆర్వో మణిమాల, జేసి ...

Read More »

మండలంలో డబల్‌ బెడ్‌రూంలు నిల్‌

  నందిపేట, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం తీవ్ర జాప్యం జరుగుతుంది. నందిపేట మండలంలో మండల కేంద్రంలో 50 ఇళ్ళు, వెల్మల్‌లో – 50, డొంకేశ్వర్‌లో- 100 రెండు పడక గదుల ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాణం జరగలేదు. నిర్మాణం సరికదా కనీసం స్థల పరిశీలన కూడా జరగకపోవడం విచారకరం. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెల్మల్‌, నందిపేట, డొంకేశ్వర్‌ ...

Read More »

జొన్నచొప్ప పశువులకు ప్రాణాంతకం

  నందిపేట, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జొన్న చొప్ప మేపటం వల్ల పశువులు చనిపోయే ప్రమాదముందని పశు సంవర్ధకశాఖ మండల అధికారి లక్కం ప్రభాకర్‌ తెలిపారు. జొన్న చొప్పలో హైడ్రోజన్‌ సయనైడ్‌ అనే విష పదార్థం ఉండడం వల్ల పశువుల శ్వాస, జీర్ణ, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపి అతి త్వరగా పశువులు చనిపోయేలా చేస్తుంది కావున జొన్న చొప్ప మేపకుండా పశువులను కాపాడుకోవాలని ఆయన కోరారు.

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 14 ఫిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 14 ఫిర్యాదులు అందాయి. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు కమీషనర్‌కు ఫోన్‌ ద్వారా తమ సమస్యలు విన్నవించారు. సమస్యలను సంబంధిత ఎస్‌హెచ్‌వోకు బదిలీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని కమీషనర్‌ పేర్కొన్నారు.

Read More »

గంగపుత్రులను ఎస్‌టి జాబితాలో చేర్చాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంగపుత్ర కులస్తులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాంచందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆత్మగౌరవ మహాపాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. గంగపుత్రులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని, గంగపుత్రుల్లో చాలామంది విద్యాపరంగా అర్హతలున్నప్పటికి ఆర్థికవనరులు లేక ఉద్యోగాలు, పదవులు పొందలేక అవస్థలు పడుతున్నారని, గంగపుత్రులు దైన్యమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 6 ను ...

Read More »

ఆర్మూర్‌ బంద్‌ విజయవంతం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు ఐక్య కార్యాచరణ సమితి పిలుపుమేరకు సోమవారం తలపెట్టిన ఆర్మూర్‌ బంద్‌ విజయవంతమైంది. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్చందంగా బంద్‌ పాటించి రైతులకు మద్దతు ప్రకటించారు. రైతు జేఏసి నాయకులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్మూర్‌, బాల్కొండ, జక్రాన్‌పల్లి ప్రాంతాల్లో జాతీయ ...

Read More »

ఎర్రజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఎర్ర జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సుకు ముందుందని ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తు అయోమయానికి గురిచేస్తున్నారని, రైతులు దూరదృష్టితో ఆలోచించి వారు చేస్తున్న సమ్మెలను, ఆందోళనలను విరమించుకొని ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. సిఎం కెసిఆర్‌ రైతు శ్రేయస్సుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని, గత పాలకుల ...

Read More »

భోజన వసతి కల్పించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ విద్యార్థిని, విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని నిరుద్యోగులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తాము సభ్యత్వం తీసుకొని ఉద్యోగాల కొరకు నిరంతరం కష్టపడి చదువుకుంటున్నామని, హైదరాబాద్‌ నగరంలో కేంద్ర గ్రంథాలయం (అప్జల్‌గంజ్‌), నగర గ్రంథాలయం చిక్కడపల్లిలో పాఠకులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారని, తమకు కూడా క్యాంటీన్‌ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read More »

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్‌ చౌరస్తాలోగల శివాజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. నగర నాయకులు యెండల సుధాకర్‌ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాలను అనుసరించి హిందువులందరు ఆయన చూపిన మార్గంలో నడవాలని, శివాజీలోని పోరాట పటిమను అలవరుచుకొని ధర్మరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మరక్షా ...

Read More »

⛳ఛత్రపతి శివాజీ⛳

చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 – ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఉపోద్ఘాతం ⛳ శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది ...

Read More »