Breaking News

Daily Archives: February 22, 2018

నేడు జిల్లా కేంద్రంలో వైకల్య నిర్దారణ శిబిరం

  పిట్లం, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రాంగణంలో వైకల్య నిర్దారణ శిబిరం నిర్వహించనున్నట్టు భవిత కేంద్ర నిర్వాహకులు కమల్‌ కిషోర్‌ తెలిపారు. మండలంలో 14 సంవత్సరాలలోపు పిల్లలు చెవిటి, మూగ వంటి సమస్యలున్న వారు, అంగవైకల్యం ఉన్నవారు ఈ శిబిరానికి సదరం దృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, వైకల్యానికి సంబంధించిన రెండు ఫోటోలతో హాజరుకావాలని కోరారు. శిబిరంలో సహాయక ఉపకరణాలు నిర్దారిస్తామని పేర్కొన్నారు.

Read More »

పిట్లంలో పిఆర్‌టియు ఉపాధ్యాయుల ధర్నా

  పిట్లం, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట గురువారం మండల పిఆర్‌టియు ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ దర్నాలో మండల పిఆర్‌టియు అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్‌ విధానం రద్దు చేస్తు ఏకీకృత సర్వీసు సాధన మరియు అపరిష్కృత సమస్యల సాధనకై ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పించన్‌ విధానం అమలు చేయాలని రాష్ట్ర పిఆర్‌టియు శాఖ ఆదేశాల మేరకు గురువారం ...

Read More »

పిట్లం మండల కుర్మ సంఘం ఎన్నిక

  పిట్లం, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలోని కుర్మ కులస్తుల నూతన కార్యవర్గాన్ని గురువారం జిల్లా కుర్మ సంఘం డైరెక్టర్‌ ఏర్వుగొండ ఎన్నుకున్నారు. పిట్లం మండల అధ్యక్షునిగా మేకల మల్‌గొండ, కార్యదర్శి కుర్మ పాపయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పిట్లం సభ్యులు సాయిలు, పోశగొండ, శంకర్‌, అశోక్‌ తదితరులున్నారు. సమావేశంలో నూతన అధ్యక్షుడు మల్‌గొండ మాట్లాడుతూ కుర్మ సంఘం అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Read More »

ఘనంగా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యాలయ ఆవరణలో వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రేనింగ్‌ కమీషనర్‌ భగవంత్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భద్రయ్య మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. అనంతరం సర్వమత ప్రార్థన నిర్వహించి పతాకావిష్కరణ చేశారు. అనంతరం స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్తులు ర్యాలీ నిర్వహించారు.

Read More »

ఫైనాన్స్‌ వ్యాపారి ఆత్మహత్య

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ఫైనాన్స్‌ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి… మాచారెడ్డి మండలం వాడి గ్రామానికి చెందిన చిన్నోల్ల నర్సారెడ్డి (42) బుధవారం రాత్రి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరివేసుకొని మృతి చెందినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. బుధవారం అందరితో అన్యోన్యంగా గడిపి గాంధీగంజ్‌లో తన ఫైనాన్స్‌ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కొందరు కారకులు అంటూ బాధితుడు నోట్‌ రాసి ...

Read More »

డొంకేశ్వర్‌లో ఎర్రజొన్న కొనుగోలు కేంద్రం

  నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గత వారంరోజుల నుంచి ఆర్మూర్‌ నియోజకవర్గ రైతులు చేస్తున్న ఉద్యమ కార్యాచరణకు స్పందించిన ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2300 ల ధరతో మార్కెట్‌ కమిటీల ద్వారా కొనుగోలు చేయడానికి ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఇది వరకే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు పెంచాలని గురువారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరగా ...

Read More »

సూర్యోదయ స్కూల్లో 14 మంది కవల విద్యార్థులు

  నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని సూర్యోదయ స్కూల్లో గురువారం కవలల దినోత్సవం సందర్బంగా కేక్‌ కట్‌ చేసి ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని వివిధ తరగతులకు చెందిన 14 మంది కవల జంటలు (28 మంది) ఉన్నారు. వీరందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారిచేత కేక్‌ కట్‌ చేయించి పంచిపెట్టారు. ఆట పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఒకే పాఠశాలలో 14 జంటల కవలలు ఉండడం అరుధైన విషయమని కరస్పాండెంట్‌ చంద్రకళ నాగారావు తెలిపారు. ...

Read More »

హైకోర్టు అనుమతితో బల్దియాలోకి కౌన్సిలర్‌కు అనుమతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో అభ్యర్థిగా పోటీచేసి లెక్కలు చూపనందున 25వ వార్డు కౌన్సిలర్‌ సల్ల రాధికను ఆరునెలల క్రితం మునిసిపల్‌ కమీషనర్‌ ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు సమావేశానికి రావద్దు అనే ప్రతిని కౌన్సిలర్‌కు అందజేశారు. అప్పటినుంచి ఎలాంటి సమావేశాలకు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు కొనసాగాయి. బాధితురాలు లెక్కలకు సంబంధించిన పత్రాలను హైకోర్టులో సమర్పించడంతో తిరిగి అనుమతినిస్తు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం కమీషనర్‌తోపాటు జిల్లా కలెక్టర్‌కు కోర్టు ఉత్తర్వుల ...

Read More »

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

  నందిపేట, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద గురువారం ఏర్పాటు చేసిన ధర్నా శిబిరానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ పాల్గొని ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు కోరుతున్న సిపిఎస్‌ విధానం రద్దుచేస్తు మిగతా 14 డిమాండ్లుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. మన తెలంగాణ మనకు వస్తే ఉద్యోగాలు, నీటి వనరులలో ఎలాంటి కష్టాలు ...

Read More »

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గురువారం జిల్లా కేంద్రంలోగల గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేఏసి ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జేఏసి కన్వీనర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ విద్యార్థులను నిలువులా మోసం చేస్తున్నారని దీనిపై ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి పోస్టు కార్డుల ద్వారా నిరసన తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ...

Read More »

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యాలయం ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యాలయాన్ని గురువారం ఉదయం జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ, సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకొని భావిభారత పౌరులుగా ఎదగాలని ఎస్‌పి సూచించారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమాల నిర్వహణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భద్రయ్య, శ్రీనివాస్‌, సంధ్య, గోపాలకృష్ణ, లక్ష్మయ్య, ...

Read More »

ఫండ్స్‌ రైజింగ్‌లో పాల్గొన్న నగర మేయర్‌

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర మేయర్‌ ఆకుల సుజాత హైదరాబాద్‌లో గురువారం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫండ్స్‌ రైజింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగర ప్రజలు, హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వారు షేర్‌ మార్కెట్‌ తరహాలో దాదాపు 200 కోట్ల రూపాయలు నిధులు సేకరించి రహదారుల అభివృద్ది పథకం కింద 8.9 శాతం వడ్డికి గాను పది సంవత్సరాలకు బాండ్స్‌ తీసుకున్నారని జిహెచ్‌ఎంసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వివరించారు. ఆదాయాన్ని ...

Read More »

ఆల్ఫజోలమ్‌ స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ ఎక్స్‌రోడ్డులో కల్తీకల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫజోలమ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సిఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుంకెట్‌ గ్రామానికి చెందిన బండి మోహన్‌ అలియాస్‌ సుంకెట్‌ మోహన్‌ అనే వ్యక్తి హీరోహోండా వాహనంపై కిలో పరిమాణం గల ఆల్ఫజోలమ్‌నును తరలిస్తుండగా తమ బృందం పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. దీని విలువ మూడు ...

Read More »

అదనపు ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌లో రైతుల సౌకర్యార్థం నూతనంగా మరో ఐదు ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌లో డొంకేశ్వర్‌, ఆలూరు, ఖుద్వాన్‌పూర్‌, పిప్రి, గోవింద్‌పేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఐదు ...

Read More »

రైలుకింద పడి దంపతుల ఆత్మహత్య

  – ఒంటరైన పదినెలల చిన్నారి కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం బ్రాహ్మణ్‌పల్లిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన కాశీనాథ్‌ అతని భార్య, పదినెలల చిన్నారిని రైల్వే స్టేషన్‌లో వదిలి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలం చేరుకున్న తూప్రాన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. స్టేషన్‌ ఆవరణలో అనాథగా మిగిలిన చిన్నారిని చూసి చూపరులు కంట నీరుపెట్టుకున్నారు. శవాలను పోస్టుమార్టం ...

Read More »

26 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రజా చైతన్యం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ బవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి చేరవేసే ఉద్దేశంతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. యాత్ర మార్చి 4వ తేదీన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ప్రవేశిస్తుందని, రెండ్రోజుల పాటు జిల్లాలో పర్యటించి పోచంపాడ్‌లో ముగుస్తుందని ఆయన వివరించారు. బస్సుయాత్ర ...

Read More »