Breaking News

Daily Archives: February 25, 2018

సినీ నిర్మాత, మాజీ సర్పంచ్‌ మృతి

  – పలువురి సంతాపం కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన సినీ నిర్మాత, మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌ (82) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. సినీ నిర్మాతగా భగవాన్‌ చిత్రంతోపాటు మరో ఐదు చిత్రాలు శ్రియ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌పై చిత్రీకరించారు. కామారెడ్డి తొలి సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యారు. ప్రభాకర్‌ మృతి పట్ల ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, ఆయా పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సంతాపం ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ...

Read More »

టిజివిపి ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సి ప్రతిభ పరీక్ష

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించినట్టు టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ తెలిపారు. పరీక్షకు 520 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా, ప్రతిభను వెలికితీసి పరీక్షలపై మార్గదర్శనం చేయడం జరుగుతుందన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పరీక్షల సయమంలో ఒత్తిడి, భయాన్ని విడనాడి చదివితే సులభతరమవుతుందని, తల్లిదండ్రులు, అధ్యాపకులు ...

Read More »

ది కామారెడ్డి లారీ ఓనర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ది కామారెడ్డి లారీ ఓనర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఆదివారం స్థానిక అసోసియేషన్‌ సంఘ భవనంలో పోలింగ్‌ నిర్వహించారు. అధ్య్ష పదవికి ముగ్గురు పోటీపడగా సయ్యద్‌ ఆజం అలీ ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ మాజీద్‌ గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా సయ్యద్‌ జాకీర్‌, మహ్మద్‌ షాబీబ్‌, మహ్మద్‌ ఖలీల్‌లు, రహమాన్‌ ...

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని నలుగురికి రూ.2.25 లక్షల సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆదివారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

కమ్యూనిటి భవనం ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వాసవీనగర్‌లో నిర్మించిన వాసవీ కమ్యూనిటి భవనాన్ని ఆదివారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. రూ. 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటి భవనం ప్రహరీని ప్రారంభించి మాట్లాడారు. ఆర్యవైశ్య ప్రతినిదులు, సభ్యులు సమాజ సేవలో పాల్గొనడం అభినందనీయమన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ భైరయ్య, మహేశ్‌ గుప్త, కైలాష్‌ శ్రీనివాస్‌, హరిధర్‌, తదితరులు ఉన్నారు.

Read More »

సినీ నిర్మాత, మాజీ సర్పంచ్‌ మృతి

  – పలువురి సంతాపం కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన సినీ నిర్మాత, మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌ (82) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. సినీ నిర్మాతగా భగవాన్‌ చిత్రంతోపాటు మరో ఐదు చిత్రాలు శ్రియ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌పై చిత్రీకరించారు. కామారెడ్డి తొలి సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యారు. ప్రభాకర్‌ మృతి పట్ల ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, ఆయా పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సంతాపం ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ...

Read More »

మార్చి 2 నుంచి థియేటర్ల బంద్‌

టు దక్షిణాది నిర్మాతల సంఘం తీర్మానించింది. సినిమా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు క్యూబ్‌, యూఎఫ్‌ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వచ్చే నెల 2నుంచి  సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈకారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్‌ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడనున్నాయి. వివాదం ఏంటి? ప్రింట్‌ వ్యవస్థ స్థానంలో డిజిటల్‌ సర్వీస్‌ ...

Read More »

గుడ్డు పెట్టాడు….గుడ్లు తేలేశారు!

అదేంటి మనిషి ఎక్కడైనా గుడ్డు పెడతాడా? జంతువులు, పక్షులు కదా గుడ్డు పెట్టేవి అని అనుకుంటున్నారా? కానీ ఇండోనేషియాకు చెందిన 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. అదేంటని విచిత్రంగా అనుకుంటున్నారా? దాని సంగతేంటో ఓసారి చూద్దాం. ఇండోనేషియాకు చెందిన అక్మల్‌ గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడనీ, ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడనీ అతని తండ్రి తెలిపాడు.  ఈ విచిత్ర వ్యవహారంపై వైద్యులను సంప్రదించినా ఫలితం  లేకపోయింది. డాక్టర్ల ఎదుటే అక్మల్‌ రెండు గుడ్లు పెట్టాడు. దీంతో గుడ్లు తేలేయడం వైద్యుల ...

Read More »

శ్రీదేవి మృతి పట్ల స్పందించిన రామ్‌గోపాల్ వర్మ

అందాల తారా, అతిలోక సుందరి శ్రీదేవి(54) శనివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. కాగా శ్రీదేవి మృతి ఒక్కసారి దేశ వ్యాప్తంగా అందరిని షాక్‌కి గురి చేసింది. ముఖ్యంగా ఆమెను అభిమానించేవాళ్లు శ్రీదేవి ఇకలేరు అనే వార్తని నమ్మలేకపోతున్నారు. కాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శ్రీదేవి మృతిపై తనదైన శైలీలో స్పందించారు. ‘‘దేవుణ్ణి ఈ రోజులా గతంలో ఎన్నడూ ద్వేషించలేదు. నా జీవితంలో అత్యంత పెద్ద వెలుగుని అతను ...

Read More »