Breaking News

Daily Archives: February 27, 2018

అంకితభావంతో పనిచేసి రోగులకు సేవలందించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అంకితభావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రిలో సమీక్షించారు. అన్ని విభాగాల సిబ్బంది పనితీరుపై సమీక్షించి వారికి పలు సూచనలు చేశారు. కాయకల్ప కార్యక్రమంలో నాణ్యమైన సేవలందించినందుకు రాష్ట్రస్థాయిలో కామారెడ్డికి 5వ స్తానం రావడం పట్ల మెడికల్‌ సూపరింటెండెంట్‌ వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఈ సేవలు ఇలాగే ...

Read More »

నేడు కామారెడ్డిలో జాబ్‌మేళా

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి జయరెడ్డి తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, ఇజిఎంఎం ఆధ్వర్యంలో స్తానిక డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా ఉంటుందన్నారు. పలు రంగాలకు సంబంధించిన 15 బహుళజాతి కంపెనీలు మేళలో పాల్గొంటున్నాయన్నారు. ఇందులో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, ఆపై చదివి 15 నుంచి 35 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు దీనికి అర్హులని ...

Read More »

కందుల కొనుగోలు కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని కందుల కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యకు బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 130 మంది రైతుల పేరిట కందులు కొనుగోలు చేసిన వాటిలో సగం మంది బినామిలే ఉన్నారన్నారు. కందులు విక్రయించిన రైతులకు 35 రోజులు గడుస్తున్నా ఇప్పటికి డబ్బు చెల్లించలేదని చెప్పారు. మార్కెట్‌ యార్డులో రైతులకు ...

Read More »

దళితులకు భూ పంపిణీ కోసం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

  కామారెడ్డి ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలైన దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల భూ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తు బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రాజలింగం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లోని అర్హులైన దళిత, బహుజనులకు మూడెకరాల భూ పంపిణీ చేపట్టాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు ...

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆజాద్‌ వర్ధంతి

  కామారెడ్డి ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యాలయంలో మంగళవారం చంద్రశేఖర్‌ ఆజాద్‌ 87వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఏఐఎస్‌ఎప్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్‌ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమరంలో అమరుడైన వీరుడు ఆజాద్‌ అని కొనియాడారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, అశ్వఖుల్లా ఖాన్‌ సహచరుడి బ్రిటీష్‌వారి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ఆజాద్‌ దేశం గర్వించదగ్గ అసామాన్య వీరుడన్నారు. మధ్యప్రదేశ్‌లోని ...

Read More »

ఎమ్మెల్యేకు సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి మండలం దేవునిపల్లి కాకతీయ నగర్‌ కాలనీ వాసులు మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను సన్మానించారు. కాకతీయ నగర్‌ కమ్యూనిటి భవన ప్రహరీ గోడకోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాతో సత్కరించారు. కాకతీయ నగర్‌ కాలనీలో సిసి రోడ్లు, మురికి కాలువలు, మౌలిక వసతులు ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా ...

Read More »

ప్రహరీ గోడకు రూ. 5 లక్షలు మంజూరు

  కామారెడ్డి ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి కాకతీయ నగర్‌ కాలనీలోని కమ్యూనిటి హాల్‌ ప్రహరీ గోడ నిర్మాణానికి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తన నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధుల విడుదల ప్రతిని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎంపిపి లద్దూరి మంగమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామాభివృద్దికి సహకరిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ రాజేందర్‌, కాలనీవాసులు కృష్ణారెడ్డి, ...

Read More »

ఎండుగంజాయి స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామ శివారులోగల మధ్యప్రదేశ్‌ దాబాలో మంగళవారం ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు అదికారులు జరిపిన దాడుల్లో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా దాబాలో గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు తాము మంగళవారం ఉదయం జరిపిన దాడుల్లో 1.6 కిలోల ఎండుగంజాయి స్వాదీనం చేసుకున్నామని, దాబా మేనేజర్‌ వినోద్‌కుమార్‌ను, గంజాయి సరఫరా చేస్తున్న అశోక్‌ను ...

Read More »

కాజ్‌వే పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త మంగళవారం నగరంలో 15,16వ డివిజన్‌లలో కాజ్‌వే పనులు ప్రారంభించారు. అదేవిధంగా 13,14,21 డివిజన్‌లలో డివిజన్‌కు రూ. 20 లక్షల చొప్పున మొత్తం 60 లక్షల నిధులతో సిసి డ్రైనేజీ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఖిల్లా రామాలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నగర అభివృద్దికి నిరంతరం కష్టపడుతున్నామని, నగరం రానున్న రోజుల్లో అతి పెద్ద సుందర నగరంగా ...

Read More »

సిఎం దిష్టిబొమ్మ దగ్దం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ దిష్టిబొమ్మను భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆద్వర్యంలో మంగళవారం స్థానిక హైదరాబాద్‌ రోడ్డులో దగ్దం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడిపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సిఎం దిష్టిబొమ్మ దగ్దం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కెసిఆర్‌ తన స్థాయిని మరిచి దేశ ప్రధానిపై అనుచితంగా మాట్లాడడం ...

Read More »

సిపిఎస్‌ విధానం రద్దుచేయాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ విధానం రద్దు చేయాలని తపస్‌ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలో ధర్నా చౌక్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ విధానం రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఈ సమస్యపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవించినా లాభం లేకుండా పోయిందని అన్నారు. అదేవిధంగా భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని, ఏకీకృత సర్వీసు ...

Read More »

ఎంపి కవిత ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ సందర్శన

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మంగళవారం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ పనులను సందర్శించారు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 500 మంది రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి ఎంపి బృందానికి వివరించారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ రైతులందరికి చివరిఆయకట్టు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ...

Read More »

బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకుగాను పరీక్ష కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అరగంట ముందు అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎవరిని అనుమతించరని రీజినల్‌ ఇంటర్మీడియట్‌ అధికారి ఒడ్డెన్న తెలిపారు. కావున విద్యార్థులందరు ఈ ...

Read More »

ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన

  గాంధారి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పోతంగల్‌ కలాన్‌ గ్రామంలో మంగళవారం నవగ్రహ విగ్రహ ప్రతిష్టా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు రోజులుగా స్థానిక ఆంజనేయ ఆలయం ఆవరణలో నూతనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు నవగ్రహ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిరోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ట చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో తెరాస ...

Read More »