Breaking News

మీడియా పై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన ఆవసరం ఏమిట?

Media facing a crisis of trust…?
ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పత్రికా ప్రసార మాధ్యమాలను అలక్ష్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టాల్సిన ఆవసరం ఏమిట?
అవి అమ్ముడయే ప్రతుల సంఖ్య 90 లక్షలు! చదివేవాళ్ళ సంఖ్య మూడు కోట్ల అరవై లక్షలు!
దేశంలోని ఇతర భాషా ప్రాంతాల పత్రికలతో పోల్చి చుసేట్లయితే, మన ఆంద్రప్రదేశ్ లో తెలుగులో పత్రికలూ,అంతర్జాల పత్రికలూ, వార్తా చానళ్ళు సమృద్ధంగా ఉన్నాయి. ఇవి, దేశంలోనే కాక విదేశాలకు సైతం ముద్రణ, ప్రసార మాధ్యమాలద్వారా కోట్లాది ప్రజానీకానికి వార్తలు, వ్యక్తీకరనలను చేరవేయడమే కాకుండా,; సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, డీ టీ పీ ఆపరేటర్లు, లేఔట్ ఆర్టిస్టులు, వీడియో గ్రాఫర్లు, వేదిఒ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు, వంటి అనేక పనులు కల్పించడంద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలోని దిన, వార, పక్ష, మాస పత్రికల వంటివాటి మొత్తం సర్క్యులేషన్, అతిపెద్ద పత్రికల సర్క్యులేషన్ కంటే మూడు రెట్లు ఎక్కువ. వీరంతా కలిసి ప్రతీయేటా ముద్రణ కోసం 200 కోట్లరుపాయలను, న్యూస్ ప్రింట్ కొనుగోలుకోసం మరో 200 కోట్లను వ్యయపరుస్తున్నారని అంచనా వేయడమైనది. 
న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా రిజిస్త్రార్ జనరల్ కార్యాలయ గణాంకాల ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న పెద్ద దిన పత్రికలను మినహాయించి దాదాపు 9000 సంఖ్యలో చిన్న, మధ్య తరహా పత్రికలు వివిధ కాలావధులలో ప్రచురిత మౌతున్నాయి. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ నుంచీ 5,731, తెలంగాణా నుంచీ 3,201 ప్రచురితమవుతున్నాయి. వాటి కనీస సగటు సర్క్యులేషను ఒక్కోటీ 1000 ప్రతులు గా ఉంది. ఒక అధ్యయనం వెల్లడించిన ప్రకారం, ఒక్కో వార్తా పత్రికనూకనీసం నలుగురికి తగ్గకుండా చదువుతున్నారు. ఆ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ చిన్న మధ్య తరహా పత్రికలను మూడు కోట్ల అరవై లక్షలమంది చదువుతున్నట్లు అంచనా వేయడమైంది. పెద్ద పత్రికల సర్క్యులేషన్ మొత్తం ముప్ఫై లక్షలుగాను,వాటి చదువరుల మొత్తం సంఖ్య కోటిన్నర గానూ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ తేల్చింది. ఇక, ఈ చిన్న, మధ్య తరహా పత్రికలే కాకుండా ఐదు వందల వార్తా వెబ్ సైట్లున్నాయి. వీటిని అనుసరించేవారు లక్షల్లో ఉన్నారు. వివిధ అంశాలకు సంబంధించిన వార్తలకోసం పదివేల కుటుంబాలకుపైగా ఈ చిన్న పత్రికలూ, వార్తా చానళ్ళపై ఆధారపడుతున్నాయి. 
రాష్ట్ర ప్రభుత్వ సమాచార కేంద్రం, కేంద్ర ప్రభుత్వపు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యురోలు పంపే వార్తా నివేదికలను పెద్ద పత్రికలూ సరిగా ప్రచురించడంలేదు. చిన్న, మధ్య తరహా పత్రికలు మాత్రమే వాటిని పూర్తిగా ప్రచురిస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వ సంస్థలు చిన్న, మధ్య తరహా పత్రికల పట్ల సవతి తల్లి ప్రేమతో వ్యవహరిస్తున్నారు. అతి ముఖ్యమైన విషయమేమంటే, అనేక అంశాలపై ప్రజానీకాన్ని జాగృత౦ చేస్తున్న ఈ పత్రికల సంపాదకులు, సంపాదక ప్రచురణ కర్తలూ వృత్తిజీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సంపాదకుల సంఘం తను ప్రారంభమైనప్పటినుంచీ, ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలను చేయడమే కాకుండా, సామాజికాంశాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి చర్చా వేదికలు, సమావేశాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంపాదకుల సంఘం తన వాణిని వినిపించెండుకై, “జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్” అనే మాస పత్రికను కూడా ప్రచురిస్తున్నది. 
ఈ సంఘపు ముఖ్య డిమాండ్లు: సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కింది ముఖ్య డిమాండ్లు చేసేందుకు ప్రతిపాదిస్తోంది. 
ఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రకటనలకు కేటాయించే మొత్తంనిదులలోంచీ, తగినంతమంది చూసే చిన్న మధ్య తరహా పత్రికలకు మూడింట ఒకవంతు నిధులను కేటాయించాలి. 
బి) ప్రచురణ, [
ప్రసార మాధ్యమాలలోను, వెబ్సైటులలోను సంపాదకులుగా పనిచేస్తుండే సమాజంలోని పేద, కింది మధ్య తరగతికి చెందిన వారు కనాకష్టంగా జీవనం సాగిస్తున్నారు. యాభై ఏళ్ల వయసు దాటినా కళాకారులందరికీ ఇస్తున్న విధంగా కనీసం నెలకో ఐదు వేలరూపాయలను తక్షణం మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. 
సి}ఇండ్లు కట్టుకునేందుకు, నేషనల్ మీడియా సెంటర్ ను ఏర్పాటు చెసుకునేఁ దుకు; ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ కు అనుబంధంగా ఉన్న ఏపీ ఎడిటర్స్ హౌసింగ్ సొసైటీకిరాయితీ ధరల్లో పది ఎకరాల భూమిని కేటాయించాలని అడుగుతున్నాం.
డి)సంబంధిత జిల్లాలో సొంత ఇంటి స్థలం లేని ఎడిటర్లకు రెండువందల గజాల నివాస స్థలాన్ని తప్పనిసరిగా కేటాయించాలి.
ఈ)పదేళ్లుగా పని చేస్తున్న పత్రికలూ, న్యూస్ ఆర్గనైజేషన్లు, వార్తా చానళ్ళు, తమస్వంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రాయితీ ధరలతో స్థలాలను కేటాయించాలి.
ఎఫ్) చిన్న పత్రికలూ (దిన, వార,పక్ష, మాస పత్రికలు) ఒక్కొక్కదానికీ మూడు గుర్తింపు కార్డులు (అక్రిడిషణ్); నడుస్తున్న వార్తా వెబ్ సైట్లకు రెండు గుర్తింపు కార్డులూ నిబంధనల ప్రకారం మంజూరు చేయాలి.
జి) ఎడిటర్ల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పది కోట్లు మంజూరు చేయాలి.
హెచ్) ప్రతీ ఏటా ‘నార్ల వెంకటేశ్వరరావు స్మారక పురస్కారానికి ఎంపికైన బహుమతి గ్రహీతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు లక్షల నగదు బహుమతి అందజేయాలి.
ఐ) కొన్ని వార్తా వెబ్ సైట్ల ఎడితర్లపై ప్రభుత్వం కేసులు పెట్టడమయింది. ఈ విషయమై, వారికి సాధ్యమైనంతవరకూ ఇతరుల మనోభావాలను దేబ్బతీసేటట్లు రాయవద్దని, వార్తలు అందించేటప్పుడు సంయమనం పాటించాలనీ విమర్శ సైతం నిర్మాణాత్మకంగా ఉండాలనీ,పాత్రికేయుల సంఘం వారికి సలహా ఇస్తోంది. అలానే తమకు బాధ కలిగించిన వారిపై శతృత్వ భావనను విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతోంది. పాత్రికేయ రంగంలో ఉన్నవారిపై దాడులను అరికట్టేందుకు ఒక ప్రత్యెక చట్టాన్ని తేవలసిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నది.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article