నిజామాబాద్ టౌన్, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని వినాయక్‌నగర్ అమరవీరుల స్థూపం పార్కులో శుక్రవారం ఉదయం వాకర్స్‌కు మ్యాక్స్ క్యూర్ నిహారిక ఆసుపత్రి ఆద్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది వాకర్స్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఆసుపత్రి మేనేజర్ సురేశ్‌బాబు తెలిపారు. వాకర్స్‌కు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో మాక్స్ క్యూర్ నిహారిక ఆసుపత్రి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, తాము నిర్వహించే క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తు మరిన్ని హెల్త్ క్యాంపులు నిర్వహించడమే తమలక్ష్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది స్వామి పాల్గొన్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018