Breaking News

జర్నలిస్టు పిల్లలకు పాఠశాల పీజులో రాయితీ

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018-19 విద్యాసంవత్సరానికి గాను జర్నలిస్టు పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో రుసుము 50 శాతం మినహాయింపు సంబందించిన ఉత్తర్వులు సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నుంచి టియుడబ్ల్యుజె నాయకులు అందుకున్నారు. జర్నలిస్టు పిల్లల ఫీజు రాయితీకి సంబంధించి టియుడబ్ల్యుజె, టిఇఎంజెయు నాయకులు జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారులకు గతంలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మినహాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు భాస్కర్‌, అంజి, రాము, నాగరాజు, రాజు, ప్రయివేటు స్కూల్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు రాజశేఖర్‌, ఆనంద్‌రావు, రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article