Breaking News

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నివేదిక అందించాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై ఈనెల 26వ తేదీలోగా నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కవిత అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో వివిధ పథకాలపై పలు అంశాలను కలెక్టర్‌ ప్రస్తావించారు. ఈనెల 26వ తేదీన దిశ సమావేశం ఉన్నందున సమగ్ర నివేదికతో ఆయా శాఖల అధికారులు హాజరై అడిగిన ప్రశ్నలకు సరైన విధంగా సమాధానం చెప్పాలని సూచించారు. ప్రభుత్వ బదిలీల ప్రక్రియ పూర్తయినందున సంబంధిత కార్యాలయంలో విధులకు హాజరైన సిబ్బంది వివరాలు జిల్లా పంచాయతీ అధికారికి అందజేయాలని ఆయన సూచించారు. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ శాఖ, మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న అదికారులను ఎన్నికల విధులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినందున, అందులో పనిచేసే మినిస్టిరియల్‌ సిబ్బందికి మినహాయింపు లేనందున వారి వివరాలు అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఆర్డీవో వినోద్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article