Breaking News

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటి కమీషనర్‌ సందీప్‌ సక్సెనా అన్నారు. శుక్రవారం స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌లో భాగంగా న్యూఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సక్సెనా మాట్లాడుతూ ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు కిలోమీటర్ల పరిదిలో ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంటింటి సర్వే కొనసాగుతున్నందున ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్లు తొలగించుట, చేర్పులు, నూతన ఓటర్ల నమోదు, తదితర అంశాలు జనవరి 1, 2019 వరకు భవిష్యత్తు ఓటర్ల వివరాలు సేకరించిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో 1400 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 మంది ఓటర్ల చొప్పున పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులనుద్దేశించి జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ఎన్నికల కమీషన్‌ సూచించిన విధంగా పోలింగ్‌ స్టేషన్‌ పునరుద్దీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1050 నుంచి 1100 ఓటర్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో 1250 నుంచి 1300 మంది ఓటర్లు ఉన్న పక్షంలో పోలింగ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఓటర్ల జాబితా నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి డిఆర్వో వినోద్‌కుమార్‌, ఆయా నియోజకవర్గాల ఇఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article