Breaking News

హరితహారానికి స్థలాలు ఎంపిక చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 4వ విడత హరితహారం కార్యక్రమానికి సంబంధించి మొక్కలునాటేందుకు స్థలాలు ఎంపిక చేసుకోవాలని, వాటిని హరితహారం సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జోషి సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. 4వ విడత హరితహారాన్ని త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ భూపాలపల్లిలో ప్రారంభిస్తారన్నారు. నర్సరీ డైరెక్టరీ ద్వారా ఏ గ్రామానికి ఎన్ని మొక్కలు పంపుతున్నామో సమాచారాన్ని సంక్షిప్తంగా పొందుపరచాలన్నారు. హరితహారంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 6మొక్కల చొప్పున నాటడానికి ప్రదేశాలను ఎంపిక చేసి ఉంచాలన్నారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోతే ఆ స్థానంలో కొత్తవాటిని నాటాలని సూచించారు. ప్రతిగ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్‌ శాఖ ద్వారా విస్తారంగా ఈత, టేకు మొక్కటు నాటేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాలని, ఇందులో అన్ని సంస్థల ప్రతినిదులు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్‌పై సిఎంఓ స్మితసబర్వాల్‌ మాట్లాడుతూ డిజిటల్‌ సైన్‌ను మండలాల వారిగా వేగవంతం చేసి కొత్త పాసుపుస్తకాలను, చెక్కులు మంజూరు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతుబీమా అమలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ 132 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటేందుకు సిద్దంగా ఉంచామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఆర్డీవోలు శ్రీను, రాజేశ్వర్‌, దేవేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఎఫ్‌వో వసంత, టిపివో శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article