Breaking News

దుర్వినియోగమైన నిధులపై విచారణ చేపట్టిన డిపివో

 

రెంజల్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి గ్రామ పంచాయతీలో లబ్దిదారుల మరుగుదొడ్ల నిధులు దుర్వినియోగమవడంతో గురువారం డిపివో కృష్ణమూర్తి విచారణ చేపట్టారు. లబ్దిదారుల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండా నిధులను కాజేసిన కాంట్రాక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాన్ని సంసద్‌ యోజన పథకం కింద 2014లో నిజామాబాద్‌ ఎంపి కవిత దత్తత తీసుకున్నారు.

ఈ సందర్బంగా గ్రామానికి చెందిన 379 మంది లబ్దిదారులకు మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.10 వేల 800 చొప్పున నిధులు మంజూరు చేశారు. అప్పట్లో పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న ఖలీంబేగ్‌ కార్యదర్శి శ్యాంరావు కలిసి కాంట్రాక్టర్‌కు చెక్కుల రూపంలో నిధులను అందించారు. రూ. 900 డిడిలు కట్టి లబ్దిదారులందరు నిర్మాణాలు చేపట్టారు. 35 మందికి సంబంధించిన నిర్మాణాలు పూర్తిస్తాయికి చేరుకోలేవు. అర్థాంతరంగానే వదిలేసి సదరు కాంట్రాక్టర్‌ పారిపోయాడు. మరో 18 మంది లబ్దిదారులు ప్రభుత్వ నిధులతో స్వంతంగా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఇందులో ఇద్దరు లబ్దిదారులు నిర్మాణాలు చేపట్టి నిధులు డ్రా చేసుకున్నారు. మిగిలిన 16 మందికి సంబంధించిన నిధులు కూడా అదే కాంట్రాక్టర్‌ తీసుకోవడం జరిగినట్టు సర్పంచ్‌, కార్యదర్శులు లిఖితపూర్వకంగా రాసిఇచ్చినట్టు డిపివో తెలిపారు. దుర్వినియోగమైన నిధులను రికవరి చేయాలని లేనియెడల బాద్యులపై చర్యలు తప్పవని డిపివో చెప్పారు. ఆయన వెంట ఇవో పిఆర్‌డి గోపాలకృష్ణ, సర్పంచ్‌ యాదవరావు, మాజీ సర్పంచ్‌ ఖలీంబేగ్‌, గ్రామస్తులు శ్రీనివాస్‌, గంగరాజు, సాజిద్‌ లబ్దిదారులు తదితరులున్నారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *