రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం

 

కామారెడ్డి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు దుర్మరణం పాలైన సంఘటన గురువారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. భిక్కనూరు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సముద్రాల రామస్వామి విదులు నిర్వహించేందుకు గురువారం బైక్‌పై పోలీసుస్టేషన్‌కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హోంగార్డు నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుంచి లారీ ఢీకొనడంతో హోంగార్డు సంఘటన స్థలంలోనే మృతి చెందగా అతనితోపాటు బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్వాపూర్‌ గ్రామ స్టేజివద్ద జాతీయ రహదారిపై సంఘటన చోటుచేసుకుంది. రామస్వామి చనిపోగా గాయాలపాలైన రాం,లక్ష్మణ్‌లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించడం అందరికి కంటతడి పెట్టించింది.

Check Also

మొదటిరోజు నిల్‌…

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికలు పురస్కరించుకొని ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *