Breaking News

రైలులో తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

 

కామారెడ్డి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని గురువారం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి మన్మాడ్‌ వెళ్తున్న రైలులో తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం పట్టుబడింది. సుమారు 3 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగించారు. రైలులో సీట్లకింద రేషన్‌ బియ్యం లభించింది. పోలీసులు ఆరాతీయగా దాన్ని తరలిస్తున్న వారు మాత్రం దొరకలేదు. దాడుల్లో రైల్వే పోలీసులు సివిల్‌ సప్లయ్‌ అధికారులు రాజశేఖర్‌, శాంతయ్య తదితరులున్నారు.

Check Also

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *