ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

 

కామారెడ్డి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమ విఫలమై క్షణికావేశంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలన్‌బాబా కాలనీలో నివాసముండే చింతల రాజేశం, బాల లక్ష్మిల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చింతల రచన (21) ఇటీవలే టిటిసి పూర్తిచేసింది. గత కొంతకాలంగా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. ముందు రచన తేజ ప్రేమను నిరాకరించింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇటీవల రచన, తేజల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో రచన ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. రచన కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపిస్తున్నారు. తేజ తమ ఇంటి చుట్టు తిరిగినట్టు కాలనీవాసులు చెప్పారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Check Also

వార్‌ వన్‌ సైడే : ఎంపీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే అని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *