Breaking News

భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం

 

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. శుక్రవారం కమీషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులో 26 కిలోల గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా బస్టాండ్‌ సమీపంలో పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. గంజాయి తరలిస్తున్న డిచ్‌పల్లి మండలానికి చెందిన గువ్వల దేవయ్యను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *