Breaking News

లోక్‌అదాలత్‌లో 114 కేసులకు పరిష్కారం

 

కామారెడ్డి, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 114 కేసులకు పరిష్కారం లభించినట్టు పట్టణ సిఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. కోర్టు లోపల ఏళ్ళ తరబడిగా పరిష్కారానికి నోచుకోని కేసులను కోర్టు వెలుపల లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశముందన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో కక్షిదారులు కోర్టు వెలుపల తమ కేసులను పరిష్కరించుకున్నట్టు పేర్కొన్నారు. మెగా లోక్‌ అదాలత్‌లో జడ్జిలు, కక్షిదారులు, పోలీసులు ఉన్నారు.

Check Also

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *