మూఢనమ్మకాలు నమ్మొద్దు

 

రెంజల్‌, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్‌ఐ అంబార్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని నీలా గ్రామంలో పోలీసు కళాబృందం ద్వారా మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మరాదని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్నా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో రాఘవేందర్‌, అక్తర్‌, సాయిలు, తదితరులున్నారు.

Check Also

ఆలయంలో దొంగ…

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోగల కేశాపూర్‌ గ్రామంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *