Breaking News

పర్యావరణ పరిరక్షణకు మట్టి పాత్రలు వాడాలి

కామారెడ్డి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి పాత్రలు, మట్టి విగ్రహాలు వినియోగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో వెనకబడిన తరగతుల అభివృద్దిశాఖ ఆధ్వర్యంలో కుమ్మరి శాలివాహన వారికి మట్టి గణపతి, మట్టి దీపాల తయారీపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేతి వృత్తుల వారిని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా జిల్లా నుంచి మొదటి విడతగా ఐదుగురికి, నల్గొండలో శిక్షణ ఇప్పించామన్నారు. శిక్షణ పొందినవారు మిగతావారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. కాలుష్యపరమైన రసాయనాలతో కాకుండా ప్రకృతి సిద్ద రంగులు వాడి గణేషుడు, దుర్గామాత లాంటి విగ్రహాలు తయారుచేయాలని చెప్పారు. వీటిని పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 2 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అనంతరం శిక్షణ పొందిన వారు తయారుచేసిన మట్టి గణేషుడి విగ్రహాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి బిసి సంక్షేమాధికారి శ్రీనివాస్‌ బాబు, ఏఎస్‌డబ్ల్యువో శంకరయ్య, సీనియర్‌ సహాయకుడు రేవంత్‌, జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు రమేశ్‌, విఠల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article