Breaking News

ప్రతి పాఠశాలలో హరితహారం

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పాఠశాలను హరితపాఠశాలగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో పర్యటించి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పాఠశాలల్లో మొక్కలునాటి హరితహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థి కనీసం 6 మొక్కలునాటాలని కలెక్టర్‌ సూచించారు. బాల్కొండలోని ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులతో కలిసి మొక్కలునాటి నీరుపోశారు. పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు కనీసం ప్రతి విద్యార్తి 6 మొక్కలు నాటాలని, దీని అమలుకు విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ప్రతి విద్యార్థి ముందుకు రావాలని ఆ దిశగా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ళు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌, తహసీల్దార్‌ రాజేందర్‌ తదితరులున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article