Breaking News

మిషన్‌ భగీరథపై మంత్రి పోచారం సమీక్ష

 

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లతో మిషన్‌ భగీరథపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకానికి అత్యంతప్రాధాన్యత నిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే సిఎం కెసిఆర్‌ ఆశయమని, దానికనుగుణంగా ఎమ్మెల్యేలు, అదికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలతో వేగంగా పని చేయించుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1645 నివాస ప్రాంతాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందని, సింగూరు సెగ్మెంట్‌, శ్రీరాంసాగర్‌ సెగ్మెంట్‌ల ద్వారా నీరు ప్రజల దాహార్తి తీరుస్తుందని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌, బోధన్‌ ఎమ్మెల్యేలు ఏనుగురవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేశ్‌ గుప్త, జీవన్‌రెడ్డి, షకీల్‌ అహ్మద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రామ్మోహన్‌రావు, సత్యనారాయణ, చీఫ్‌ ఇంజనీర్‌ ప్రసాద్‌రెడ్డి, గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారులు, కాంట్రాక్టర్లు, వర్కింగ్‌ ఏజెన్సీల ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *