Breaking News

తెరాస ప్రభుత్వానికి ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం

కామారెడ్డి, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరాచకపు పాలన కొనసాగిస్తున్న తెరాస ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి ధర్నా చౌక్‌ వద్ద ఆయన నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఎన్నికలు కాగానే తానే గద్దెనెక్కి తన కుటుంబసభ్యులను క్యాబినెట్‌లో చేర్చుకొని తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాయమాటలతో కెసిఆర్‌ కాలం గడుపుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ మర్రి రాంరెడ్డి, రమణారెడ్డికి వైద్య పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మురళీధర్‌గౌడ్‌, బాణాల లక్ష్మారెడ్డి, నీలం చిన్నరాజులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *