Breaking News

కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రాల్లో ఉన్న పరికరాలను పరిశీలించారు. వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article