Breaking News

రోడ్ల విస్తరణ భూసేకరణ 25 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులైన నేషనల్‌ హైవే అథారిటి ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ హైవే రోడ్ల విస్తరణకు అవసరమైన భూ సేకరణను సంబంధిత గ్రామ పరిధిలోని రైతుల నుంచి సేకరించి సంబంధిత భూమిని ఈనెల 25 లోగా ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. కామారెడ్డి కలెక్టర్‌ చాంబరులో ఏర్పాటైన కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్‌ యాదిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రోడ్లు, నేషనల్‌ హైవే మంత్రి నితిన్‌ గడ్కరీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నేషనల్‌ హైవే బూసేకరణ కోసం రూ. 27 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. విశాలమైన రోడ్ల ద్వారా అభివృద్ది పలు రంగాల్లో కనిపిస్తుందని చెప్పారు. భూసేకరణలో భాగంగా 12 వేల కోట్ల పనులు టెండరు దశలో, 15 వేల కోట్ల పైప్‌లైన్‌లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. భూసేకరణలో అటవీశాఖ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సర్టిఫికెట్లు జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో అందించాలన్నారు. అనంతరం అడిషనల్‌ పిసిసిఎఫ్‌ శోభ మాట్లాడుతూ అటవీ భూమికి సంబందించి రంగారెడ్డి, నాందేడ్‌, అకోల మార్గంలో కామారెడ్డి నుంచి బాన్సువాడలో 61 హెక్టార్ల భూమి సేకరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు 216 హెక్టార్లు సేకరించామని సంబంధితులకు 22 లక్షల 46 వేల 45 రూపాయలు పంపిణీ చేశామన్నారు. మిగతా 100 హెక్టార్ల భూసేకరణకు డబ్బు విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article