Breaking News

కుర్మ కులస్తులకు పార్టీలు సీట్లు కేటాయించాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు కుర్మ కులస్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి చిన్నదేవన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. తెరాస ప్రకటించిన 105 సీట్లలో ఒక్కరుగాని కుర్మ సామాజిక వర్గానికి చెందినవారు లేరని, రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కుర్మ కులస్తులకు తెరాస ఒక్క సీటు కేటాయించకపోవడం కుర్మ జాతిని అవమానించినట్టుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే టికెట్‌ను సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కేశ వేణుకు ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. కష్టపడి పనిచేసే గుణం గల వేణును కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెడితే విజయం సాధిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాబాద్‌ ఉమ్మడిజిల్లా, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఓటర్లు పైగా ఉన్న కుర్మ కులస్తులను గుర్తించి ఈ ప్రాంతాల్లో తమ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా కుర్మ సంఘం నాయకులు గంగాధర్‌, బోగేందర్‌, మోహన్‌, కె.గంగాధర్‌, నర్సయ్య, మహావీర్‌, శ్రీనివాస్‌, అశోక్‌, గంగాధర్‌, రాజేశ్వర్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *