Breaking News

చిన్నారుల బతుకమ్మ సంబరాలు

రెంజల్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, నీలా, కందకుర్తి, అంగన్‌వాడి కేంద్రాల్లో సోమవారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో చిన్నారులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండగ సందర్భంగా ప్రతియేట ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో చిన్నపిల్లలతో బతుకమ్మ నిర్వహిస్తామని సూపర్‌వైజర్‌ ప్రమీల తెలిపారు. తీరొక్కపూలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తయారుచేసిన బతుకమ్మ చూపరులను ఆట్టుకున్నాయి. చిన్నారులకు పలు రకాల క్రీడలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు సూపర్‌వైజర్‌ ప్రమీల, ప్రదానోపాధ్యాయుడు సాయిలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారాం, రాజు, శ్రీనివాస్‌, అంగన్‌వాడి టీచర్లు అరుణ, రాణి తదితరులున్నారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *