Breaking News

బిగాల విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. మంగళవారం 12,20వ డివిజన్‌లలో ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా గుప్త మాట్లాడుతూ అర్బన్‌ నియోజకవర్గ ప్రజల నుంచి తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, ప్రతి ఇంటిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారున్నారని, విషయం తెలిసి తమకెంతో సంతోసం కలిగిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి తెరాస అధికారం చేపడుతుందని అర్బన్‌ నియోజకవర్గం నుంచి తాను భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. అనంతరం బిగాల పాలిష్‌ స్టోన్‌, మార్బుల్‌, గ్రానైట్‌ టైల్స్‌ అసోసియేషన్‌ వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనేక కట్టడాలకు వీరందరి శ్రమ ఉంటుందని, వీరి ద్వారా అద్బుత కట్టడాలు నిర్మాణమవుతాయని, వీరి శ్రమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుప్త పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు తెరాస పార్టీ సబ్యత్వం పొందారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *