Breaking News

భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తి శ్రద్దలతో, శాంతియుతంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ సూచించారు. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి అనుమతి పొందాలని, చందా విషయంలో ఎవరిని బలవంతం చేయకూడదని, దుర్గామాత సందర్శనకు వచ్చే మహిళలపై యువతులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా స్పీకర్‌ల విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, సమస్యలు ఏర్పడితే డయల్‌ 100కు సంప్రదించాలని కమీషనర్‌ సూచించారు. రాత్రి 10 గంటలకు స్పీకర్లు బంద్‌ చేయించాలన్నారు. రాత్రివేళల్లో ఇద్దరు, లేదా ముగ్గురు మండపాల వద్ద ఉండేట్టు చర్యలు తీసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులు మండపాల వద్ద సంచరిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. జిల్లా ప్రజలందరికి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *