డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌

 

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో గతనెల 10వ తేదీ నుంచి అక్టోబర్‌ 9 వరకు డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శారీరక హింస కింద 62 కేసులు, ప్రమాదం కేసులు 393 కేసులు, ఆస్తి తగాదాలు 36 కేసులు, ఆత్మహత్య, ఆత్మహత్య యత్నాల కింద 58 కేసులు, తప్పుడు కాల్స్‌ కింద 5 కేసులు, ఇతరత్రా కేసులు 1717 నమోదైనట్టు కమీషనర్‌ వెల్లడించారు. ప్రజలందరు డయల్‌ 100ను సక్రమంగా వినియోగించుకుంటున్నారని, అదే సమయంలో కొందరు క్షణికావేశంలో 100కు ఫోన్‌ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తద్వారా అనవసర కేసులు నమోదవుతున్నాయని, ఫోన్‌ చేసే ముందు పూర్వాపరాలు పరిశీలించాలని సూచించారు. కమీషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడితే డయల్‌ 100కు సమాచారం అందించాలని కమీషనర్‌ సూచించారు.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article