బహుజనులు ఐక్యం కావాలి

 

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజనులందరు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా బిఎస్‌పి అద్యక్షుడు భీంరావ్‌ గైక్వాడ్‌ అన్నారు.

బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో మోసపోతున్నారని, బహుజనులకు రాజ్యాధికారం కోసం బిఎస్‌పి ఎంతో కృషిచేస్తుందని, రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బహుజనులు ఐక్యమై బిఎస్‌పిని బలపరిస్తే రానున్న రోజుల్లో బహుజనులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో బిఎస్‌పి పట్ల ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, చాలా మంది యువత పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. దీంట్లో భాగంగా ప్రముఖ న్యాయవాది బాల్‌రాజ్‌ నాయక్‌ బిఎస్‌పిలో చేరుతున్నారని ప్రకటించారు. బాల్‌రాజ్‌ నాయకత్వంలో రూరల్‌ నియోజకవర్గంలో బిఎస్‌పి మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బిఎస్‌పి నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article