Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

రెంజల్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దండిగుట్ట గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడివో చంద్రశేఖర్‌, విండో ఛైర్మన్‌ మోహినోద్దీన్‌ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతుల కొరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎపిఎం చిన్నయ్య, మార్కెట్‌ కమిటీ ఉపాద్యక్షుడు ధనుంజయ్‌, కార్యదర్శి రాందాస్‌, డైరెక్టర్‌లు రావన్‌, గంగారాం, రాము, రైతులు తదితరులున్నారు.

Check Also

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *