Breaking News

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

 

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న శాసనసభ ఎన్నికల్లో తెరాస అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రచార సరళి, కార్యకర్తల నిర్దేశం, సభల నిర్వహణపై మంత్రి పోచారం, ఎంపి కవిత సమావేశమయ్యారు. బూత్‌స్థాయి నుంచి సమన్వయం చేసుకోవాలని, అన్ని స్థాయిల్లో రోజువారి సమీక్ష జరపాలని నిర్ణయించారు. అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం చేస్తున్న మేలు గురించి ఇంటింటికి చేరవేయాలని దీనికోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌, తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్దన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేశ్‌ గుప్త, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, షకీల్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *