Breaking News

గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన ఎక్సైజ్‌ పోలీసులు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని లింగంపేట్‌, కొండాపూర్‌ గ్రామ పంచాయతీలోని కంచామహల్‌ శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళి 50 గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ సిఐ దీపిక తెలిపారు. మంజప్రేమ్‌సింగ్‌ వ్యవసాయ భూమిలో మంజనార్చోడా అనే వ్యక్తి 50 గంజాయి మొక్కలు పెంచాడని వాటిని కాల్చివేశామని తెలిపారు. అదే వ్యవసాయ భూమిలో 1.2 కిలోల ఎండు గంజాయి కూడా తమ తనికీలో లభించిందని, మంజ నార్చోడా తన వ్యవసాయ భూమిలో ఉంచాడని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి పండిస్తున్న నిందితులు పరారీలో ఉన్నారన్నారు. దాడుల్లో ఎస్‌ఐ సృజన, హెడ్‌కానిస్టేబుళ్ళు శంకర్‌, చిన్ను ప్రసాద్‌, నారాయణరెడ్డి, కానిస్టేబుళ్ళు హమీద్‌, అవినాశ్‌, శివరాం ఉన్నారు.

Check Also

ప్రతి జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం రైతుకు లాభసాటిగా చేయాల‌న్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *