Breaking News

ఓటర్లకు అన్ని వసతులు కల్పిస్తాం

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అన్ని వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం బీంగల్‌ ఎంపిపి కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని వేల్పూర్‌, బీంగల్‌ ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పోలింగ్‌ స్టేషన్లో కొన్ని చిన్న వసతులు లేనందున పోలింగ్‌ నాటికి అన్ని వసతులు అందుబాటులోకి తెస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో విభిన్నంగా వీవీప్యాట్ల ద్వారా కొత్తగా నిర్వహించనున్నందున ఓటర్లకు అవగాహన కల్పించేందుకు నియోజకవర్గానికి ఒక మోబైల్‌ వాహనంతోపాటు పది వీవీప్యాట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు.

అనంతరం తహసీల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు చేసుకున్నవి పెండింగ్‌లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదుకు అఙరజూ.ఱఅ అవకాశం ఉన్నందున అర్హులైన వారందరు దరఖాస్తు చేసుకునేందుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం వేల్పూర్‌ తహసీల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు చేసుకున్న వారి వివరాలు తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. తహసీల్‌ కార్యాలయ ఆవరణలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్రం చేసిన తర్వాత సరైన ఫోటోలతో తనకు నివేదించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. శానిటేషన్‌ సక్రమంగా లేనందున వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సరైన పారిశుద్యం లేనందున ఎంపిడివోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్పూర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల పరిశీలన, మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని అన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article