Breaking News

Monthly Archives: November 2018

అల్జాపూర్‌ శ్రీనన్నను ఆదరించండి

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాలనేత అల్జాపూర్‌ శ్రీనన్నను ఆదరించి ఆశీర్వదించి బోధన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ అన్నారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్తి అల్జాపూర్‌ శ్రీనివాస్‌కు మద్దతుగా శుక్రవారం దూపల్లి, కూనేపల్లి, కల్యాపూర్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చేసిందేమి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ...

Read More »

ఆశీర్వదించండి – అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని తెరాస బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ అన్నారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి, నీలా వీరన్నగుట్ట, కళ్యాపూర్‌, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో తెరాస పార్టీ ఎప్పుడు ముందుంటుందని ప్రజలు ఆశీర్వదించి తిరిగి తెరాసని గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. తెరాస పార్టీ నాలుగున్నరేళ్లలో అన్ని విధాలుగా ...

Read More »

మహాకూటమికే ఎంఆర్‌పిఎస్‌ మద్దతు

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులను మోసం చేసిన తెరాస పార్టీని రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించి తీరుతామని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీని ఓడించి తీరుతామని వర్గీకరణకు మద్దతు తెలిపిన మహాకూటమికే ఎంఆర్‌పిఎస్‌ మద్దతు ఉంటుందని బోదన్‌ ఎమ్మెల్యేగా మహాకూటమి బలపర్చిన అభ్యర్తినే గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ...

Read More »

బాన్సువాడకు కేంద్ర మంత్రి రాక

బాన్సువాడ, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్‌ జోషి బాన్సువాడకు రానున్నారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి నాయుడు ప్రకాశ్‌ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Read More »

మోడి పాలనలో అభివృద్ధి పథాన భారతదేశం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి పాలనలో బారతదేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుదేశ్‌ వర్మ అన్నారు. శుక్రవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడారు. భారతదేశ అభివృద్ది కొరకు నిరంతర సైనికునిలా మోడి కష్టపడుతున్నారని, ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయని, ఒకప్పుడు భారతదేశం అంటే ఇతర దేశాలకు చిన్నచూపు ఉండేదని అన్నారు. మోడి పాలనలో నల్లధనం వెలికితీయడం జరుగుతుందని, ...

Read More »

బిఎస్‌పి ద్వారానే సామాజిక న్యాయం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎస్‌పి ద్వారానే సామాజిక న్యాయం ఉంటుందని నిజామాబాద్‌ అర్బన్‌ బిఎస్‌పి అభ్యర్తి మహతి రమేశ్‌ అన్నారు. శుక్రవారం మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల కొరకు కాన్షీరాం బిఎస్‌పిని స్థాపించారని, ఇతర పార్టీలలాగా అగ్రకులాల పెత్తనం బిఎస్‌పిలో ఉండదని, ఇక్కడ అన్నికులాలకు సమానమైన గౌరవం ఉంటుందని, బడుగు, బలహీన వర్గాలకు బిఎస్‌పి అండగా ఉంటూ వస్తుందని అన్నారు. తెలంగాణలో బిఎస్‌పి బలపడుతుందని, రానున్న ఎన్నికల్లో ...

Read More »

ఎన్నికల ప్రచారంలో వినోదినిరెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కాంగ్రెస్‌ రూరల్‌ అభ్యర్థి భూపతిరెడ్డి సతీమణి వినోదినిరెడ్డి మంగళవారం మంచిప్ప గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు హారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ మహాకూటమి మేనిపెస్టోను ప్రజలకు వివరిస్తు తన భర్త భూపతిరెడ్డిని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read More »

ధర్పల్లిలో ఆనంద్‌రెడ్డి విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బిజెపి రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. లంబాడి మహిళలు వారి సంప్రదాయ నృత్యాలతో ఆనంద్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్‌ కులాలమధ్య చిచ్చుపెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. బాజిరెడ్డి, భూపతిరెడ్డి ఇద్దరు అబివృద్ది కోసం కాకుండా ఒకరిపై ఒకరు గొడవలు పడుతూ ఆదిపత్యపోరుకు పోతున్నారే తప్ప రూరల్‌ అభివృద్దికి ఏమాత్రం కృషి చేయడం లేదని ...

Read More »

ప్రచారంలో దూసుకుపోతున్న బిగాల

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి నగరంలోని పలు డివిజన్లను చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 16వ డివిజన్‌లో వెంకటేశ్వర కళ్యాణమండపం, గాయత్రీనగర్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్తానిక ప్రజలు పూలమాలలతో హారతులిచ్చి బిగాలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా గుప్త మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ ...

Read More »

ఆకుల లలిత విస్తృత ప్రచారం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి ఆకుల లలిత శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. డొంకేశ్వర్‌ గ్రామంలో మాజీ ఎంపిపి సాయిరెడ్డి ఆద్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం ఆర్మూర్‌ పట్టణంలో 1,2,3వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి అధికారం చేపట్టడం ఖాయమని, కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, తెరాసలో మహిళలకు ప్రాధాన్యత లేదని, తనపై నమ్మకముంచి ఆర్మూర్‌ ...

Read More »