Breaking News

ఆనంద్‌రెడ్డి ఆద్వర్యంలో బిజెపిలోకి భారీ వలసలు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం భారీగా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. నిజామాబాద్‌ మండలంలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి స్టేషన్‌ తాండా గ్రామస్తులు కూడా ఆనంద్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు వేసుకున్నారు. నిజామాబాద్‌ మండలం పాల్దా గ్రామస్తులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడి దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు కలిగిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు జరుగుతుంటే కెసిఆర్‌ ఆ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వల్ల ప్రధాని మోడికి పేరు వస్తుందనే అక్కసుతో కెసిఆర్‌ రాష్ట్రంలో పథకాన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రజలకు తెలియకుండా కెసిఆర్‌ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికి రైతులకు సంబంధించిన ఫసల్‌ బీమా యోజన పథకం డబ్బులు బ్యాంకుల్లో ఉన్నా రైతులకు పంచలేదని దీన్నిబట్టి కెసిఆర్‌ రాజకీయ నీతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌, మధు, వాజిద్‌, పురుషోత్తం, శ్రీనివాస్‌ యాదవ్‌, నవీన్‌, శ్రీకాంత్‌, రాజన్న, గంగారాం, ఈశ్వర్‌ నాయక్‌, నాగార్జున, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *