Breaking News

Daily Archives: November 5, 2018

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ పనుల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో నిర్మితమవుతున్న జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. కార్యాలయంతోపాటు స్థానిక ఏఎంసి గోదాములో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్‌ రూంను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, మునిసిపల్‌ కమీషనర్‌ రామాంజులురెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం రఘునాథ్‌, ఆర్‌అండ్‌బి డిప్యూటి ఇంజనీర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుధీర్‌, ఎన్నికల సిబ్బంది పవన్‌ ...

Read More »

పోలీసు కవాతు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహించారు. రాఫిడ్‌ యాక్షన్‌ ఫోర్సు, సివిల్‌ పోలీసులు వందలాదిగా కొత్త బస్టాండ్‌, స్టేషన్‌రోడ్డు, సిరిసిల్లారోడ్డు, సుభాష్‌ రోడ్డుమీదుగా తిరిగి డిఎస్‌పి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్‌పి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఎలాంటి పుకార్లు నమ్మవద్దని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా పోలీసు కవాతు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో సిఐలు రామకృష్ణ, భిక్షపతి, ఎస్‌ఐలు, సిబ్బంది ...

Read More »

నియోజకవర్గంలో 21 వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలో తమ హయాంలో 21 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన ఇచ్చిన ఘనత దక్కిందని కామారెడ్డి కాంగ్రెస్‌ అబ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బీబీపేట్‌లో పాదయాత్ర, ప్రచార సభ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బీబీపేటను మండలం చేయడంలో కాంగ్రెస్‌ పాత్ర మరువలేనిదన్నారు. నాలుగునెలలు మండలం కోసం నిరాహార దీక్ష చేసినా నాటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ స్పందించలేదని పేర్కొన్నారు. బీబీపేట చెరువు ...

Read More »

స్వార్థ రాజకీయ నాయకులను తరిమికొట్టండి

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో నియోజకవర్గాన్ని ఏలి ఏమిచేయలేకపోయిన స్వార్థ రాజకీయనాయకులను తరిమికొట్టాలని కామరెడ్డి అసెంబ్లీ బిజెపి అబ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన దోమకొండ మండలం చింతమన్‌పల్లి, ముత్యంపేట, లింగంపల్లి, గొట్టుముక్కుల, సంగమేశ్వర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. గత పాలకుల స్వార్థ రాజకీయాల వల్ల నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదని విమర్శించారు. నరేంద్రమోడి నాయకత్వంలో ...

Read More »

పార్టీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ముందస్తు అనుమతులు తప్పకుండా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం జనహితలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదులతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో భాగంగా ఎటువంటి నియమనిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ఫోటోలు తీసి పంపవచ్చని, వెంటనే దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో అతిగా మద్యం వినియోగిస్తే వాటిపై ఉన్నతస్తాయిలో పరిశీలన జరుగుతుందన్నారు. ఈనెల 12,17 ...

Read More »

పోలింగ్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 7న నిర్వహించే పోలింగ్‌ రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నోడల్‌ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం జనహితలో నోడల్‌ అధికారులతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ర్యాంపులు, ఉచిత ట్రాన్స్‌పోర్టేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఓటరు శాతాన్ని వందశాతం చేసేందుకు ప్రత్యేకంగా అధునాతన సదుపాయాలతో మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ...

Read More »