Breaking News

బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ నామినేషన్‌

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎల్‌ఎఫ్‌ రూరల్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా బిఎల్‌ఎఫ్‌ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకుడు రాజారావు, రమ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కరించడంలో తెరాస పూర్తిగా విపలమైందన్నారు. తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ను రూరల్‌ నుంచి గెలిపించాలని కోరారు. బిఎల్‌ఎఫ్‌ ద్వారానే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు నారాయణరావు, కుటుంబరావు, వేముల ఆనంద్‌, రామ్మోహన్‌, సంజీవ్‌, అనిల్‌, అఖిల్‌, రఫిక్‌, లక్ష్మి, జరీనా, గంగా తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *